ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తాజాగా గుంటూరు కోర్టు నోటీస్ జారీ చేసినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు నమోదైన కేసు కూటమి ప్రభుత్వం విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్లీ రీఓపెన్ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నది. ఆంధ్రప్రదేశ్లో 30 వేల అమ్మాయిలు మిస్సింగ్ అంటూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ఇందుకు కారణం వాలంటీర్లే అంటూ పలు సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఈ విషయంపై అప్పట్లో ఫిర్యాదు చేయగా.. ఆ కేసు గత ప్రభుత్వంలో నమోదు చేసింది కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఈ కేసును విత్డ్రా చేసుకున్నట్లు సమాచారం.


తాజాగా ఈ కేసు రీఓపెన్ చేయాలి అంటూ జడా శ్రావణ్ కుమార్ వాలంటిర్ల తరఫున పిటిషన్ వేశారు.. గుంటూరు కోర్టు కూడా ఈ పిటిషన్ స్వీకరించి కేసుకు నెంబర్ ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది కోర్టు. వాలంటీర్లు వైసిపి ప్రభుత్వం ఆదేశాల మేరకు డేటాను సేకరించడం వల్లే ఇలా జరిగిందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. దీంతో ఈ వ్యాఖ్యల పైన అప్పటి వైసిపి ప్రభుత్వం వాలంటిర్లతో ఫిర్యాదు కూడా చేయించారు.


అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ని క్యాష్ చేయాలంటూ  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిగిన తర్వాత హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తరులను జారీ చేసింది. ఆ వెంటనే కూటమి ప్రభుత్వం ఈ కేసును కూడా విత్డ్రా చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైసిపి హయాంలో నిజంగానే అమ్మాయిలు మిస్ అయ్యారా అనే చర్చ కూడా జరిగింది. అవన్నీ కూడా అసత్య ఆరోపణలు అంటూ కొంతమంది కౌంటర్లు కూడా వేశారు వైసీపీ నేతలు. కేవలం ఎన్నికలలో గెలవడానికి ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. కేంద్రం నుంచి తనకు రిపోర్టు ఉందంటూ అసత్య ప్రచారం చేశారని పలువురు నేతలు ఆరోపించారు..అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఈ కేసును ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ జడా శ్రావణ్ పిటిషన్  వేయడంతో ఈ కేసు రీఓపెన్ అయినట్లు సమాచారం. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: