ఒకప్పుడు తెలంగాణలో బిజెపి అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్ పార్లమెంటులో గెలిచారో, అప్పటినుంచి తెలంగాణలో బిజెపికి సరికొత్త ఊపు వచ్చింది. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో  కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పోటీగా బిజెపి కూడా నిలిచింది. ఇలా నడుస్తున్న తరుణంలో బిజెపి అధిష్టానం మాత్రం తరచూ ఎన్నికల సమయంలోనే ఏదో ఒక వివాదాన్ని సృష్టించే విధంగా పదవులు అందిస్తోంది. గతంలో బిజెపికి సంబంధించి ఎంపీలు ఎక్కువగా ఉండేవి కావు.. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో అప్పటినుంచి బిజెపి అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చింది..అయితే ఈ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి లీడ్ చేస్తే చాలా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు వచ్చేది. 

సరిగ్గా ఎన్నికలకు ముందే బిజెపి అధిష్టానం బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డిని నియమంచింది. ఇంకేముంది కిషన్ రెడ్డి కాస్తో కూస్తో  లీడ్ చేసుకుంటూ వచ్చారు చివరికి  8 పార్లమెంటు సీట్లు మాత్రమే దక్కాయి. అలాంటి ఈ తరుణంలో చాలామంది నాయకులు పార్టీ గాడిలో పడే సమయానికి అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇబ్బందులు పెడుతోందని భావిస్తున్నారు.. ఒకవేళ బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగితే మాత్రం పార్లమెంటు సీట్లు కనీసం ఇంకో రెండు, మూడు అయినా పెరిగేవి. ఇదిలా కొనసాగుతున్న సమయంలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంలోనే బిజెపి అధిష్టానం మళ్లీ కిషన్ రెడ్డిని  అధ్యక్ష పదవి నుంచి తప్పించి అసలు రాష్ట్రంలో ఎవరికి తెలియని నేత రామచందరు రావుకు పదవి కట్టబెట్టింది.

అధ్యక్ష పదవి కోసం ఎంతో పోటీ పడ్డటువంటి నాయకులంతా అలిగారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ ఒక వర్గం, బండి సంజయ్ మరో వర్గం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకో వర్గం అనే విధంగా ఎవరి వర్గాలు వారికి తయారైపోయాయి. కట్ చేస్తే తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి  ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో బండి సంజయ్ కిషన్ రెడ్డి లేకుండానే భేటీ నిర్వహించారు. అయితే ఈ ఇద్దరు మంత్రులు ఢిల్లీలో ఉన్నా కానీ వారికి ఈ భేటీకి ఆహ్వానం లేదు. దీనిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందిస్తూ నేను ఆంధ్ర, తెలంగాణ, అండమాన్ ఎంపీలను మాత్రమే కోఆర్డినేట్ చేస్తాను. మాజీ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులను అధిష్టానం కోఆర్డినేట్ చేసుకుంటుంది.

 అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్, పురందేశ్వరి, మిగతా సీనియర్ నాయకులను ఈ మీటింగ్ కు పిలువలేదు. ఆంధ్ర  సీఎం రమేష్ తో పాటు అండమాన్ ఎంపీలు ఇద్దరితోపాటు  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. కానీ అండమాన్ కి చెందినటువంటి ఎంపీలు రాలేదు మిగతా వారితో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశాను.. ఇందులో ఎలాంటి వివాదం లేదు. ఇది కేవలం లంచ్ మీటింగ్ మాత్రమే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా  ఎలక్షన్స్ ముందు మాత్రమే బిజెపిలో ఏదో ఒక ముసలం పుట్టి  ఓటమికి దారితీస్తుందని సీనియర్ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: