
జగన్ జైలుకు పంపితే చంద్రబాబు కడుపు మంట ఏమైనా తగ్గుతుందేమో అంటూ వ్యాఖ్యానించారు.. వైయస్సార్ పార్టీకి సీట్ల పరంగా దెబ్బ తగిలింది అనుకున్నప్పటికీ.. ఓట్ల పరంగా మాత్రం ఏమి జరగలేదంటూ సజ్జల రామకృష్ణ తెలిపారు.. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది కాలంలోనే పార్టీ నేతలు ,కార్యకర్తలు కూడా ఇంత గట్టిగా నిలబడ్డారు అంటే అధికార పార్టీ పైన ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ తెలిపారు.
కూటమి నేతలు అధికారం కోసం అబద్ధాలు చెప్పారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు సజ్జల.. వైసిపి నేతలను భయపెట్టడం, జైల్లో పెట్టినంత మాత్రాన వైసిపి పార్టీ ఎక్కడ వెనక్కి తగ్గదంటు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులతో మద్యం అమ్మకాలు చేయించి, బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు చేస్తూ లిక్కర్ అమ్మకాలకు రాచమార్గం వేస్తోంది చంద్రబాబే అంటూ విమర్శించారు .ఈ పద్ధతిని పక్కన పెట్టే మరి సరి కొత్త లిక్కర్ పాలసీ తీసుకురావడంతో అది చంద్రబాబుకి నచ్చకపోవడం వల్లే ఇదంతా చేస్తున్నారంటు సజ్జల ఫైర్ అయ్యారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలకు కూటమి నేతలు కౌంటర్ వేస్తారో లేదో చూడాలి మరి.