
రెండు తెలుగు రాష్ట్రాల స్కూలు, కాలేజీలు విద్యార్థులకు ,ఉద్యోగులకు కూడా వరుసగా సెలవులు రాబోతున్నాయి. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఆరు రోజులు సెలవులే ఉండబోతున్నాయి. మరి ఆ రోజులలో ఎందుకు సెలవులు ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఆగస్టు మూడవ తేదీన ఆదివారం, ఆ తర్వాత ఆగస్టు 8వ తేదీన శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వలు ఆప్షనల్ హాలిడే ఇస్తారు. ఆగస్టు 9వ తేదీన రెండవ శనివారం కాబట్టి ఆ రోజు కూడా సెలవే ఉంటుంది. అలాగే తొమ్మిదవ తేదీన రాఖీ పండుగ కూడా ఉన్నది. ఆగస్టు 10వ తేదీన ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా ఆ రోజున సెలవు ఉంటుంది. ఇలా 8, 9 ,10 తేదీలలో వరసగా మూడు రోజులు సెలవులు ఉండబోతున్నాయి.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా పనులు కొనసాగుతాయి. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు స్కూళ్లలో ఎక్కువగా ఆటల పోటీలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఒక రకంగా ఇది పిల్లలకు ఎంజాయ్ అని చెప్పవచ్చు. ఆగస్టు 16న శ్రీకృష్ణుని పుట్టినరోజు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్గా జరుపుకుంటారు. ఆరోజు అన్నిటికి సెలవు. ఆ మరుసటి రోజు ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెలలో విద్యార్థులకు ఉద్యోగులకు సెలవులే సెలవులు.