మనల్ని ఓడించిన వాళ్ల మీద ప్రతికాలం తీర్చుకోవడమే కాదు.. మనల్ని గెలిపించిన వాళ్లను తొక్కేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 2004, 2009 లో అధికారం ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. కానీ నెక్స్ట్ ట్రిప్ గెలిపిస్తారో లేదో అని చెప్పి రెండు ప్రాంతాలుగా విడగొట్టింది. ఒక ప్రాంతం వారు మనకి ఓటు వేస్తారని.. ఆంధ్రా ,తెలంగాణ కింద విడదీయడం జరిగింది. అలా అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఎన్నో సంఘటనలు కూడా జరిగాయి. అయితే ఇలా రెండు ప్రాంతాల వాళ్ళను రెచ్చగొట్టి గొడవలు చేసింది కూడా కాంగ్రెస్.


హిందీ బెల్ట్ లో క్రమంగా కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది. దీంతో ఇప్పుడు భాషా గొడవలను సృష్టిస్తోంది. ఇప్పుడు భాష గొడవలకు సంబంధించి జరుగుతున్నటువంటి కర్ణాటక కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే, కన్నడనే కావాలంటోంది. మరి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి హిందీ నాయకులను వెళ్లి రోజు కలిసి  వస్తూ ఉంటారు. అలాగే INDA భాగస్వామి పక్షాన ఉన్నటువంటి స్టాలిన్ తమిళం మాత్రమే ఉండాలి..హిందీ వద్దంటున్నారు. హిందీని వ్యతిరేకం చేస్తున్నారు.


హిందీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఎందుకు పని చేస్తున్నారు?.. అయితే ప్రజలకు చెప్పేది ఒకటి.. వీరు చేసేది ఒకటి. విభజించు, పాలించు అనే బ్రిటిష్ రాజ్యాంగమే ఇప్పుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నది కేవలం మూడు చోట్ల మాత్రమే. తెలంగాణ, కర్ణాటక, ఈ రెండు ప్రాంతాలలో ఏదో ఒక విధ్వంసం సృష్టిస్తూనే ఉంటుంది.హిమాచల్ ప్రదేశ్  అక్కడ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. మిగతా రాష్ట్రాలు అన్నిటిలో కూడా బిజెపి మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు కలవు. హిందీ బెల్టులో మాక్సిమం బిజెపి పార్టీనే ఉంది. ఇక ఎన్డిఏ కూటమిలో బెంగాలీలో బెంగాలి గొడవ సృష్టిస్తోంది. మహారాష్ట్రలో మరాఠీ గొడవ..అంటే కులం పేరుతో ప్రాంతం పేరుతో హిందువులని ముక్కలు చెక్కలు చేయాలని రూట్లోనే సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: