
వైసీపీ నేతల విమర్శలకు సైతం ధీటుగా, ఘాటుగా జవాబిచ్చే నైజం పవన్ సొంతం కావడంతో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా పవన్ సైలెంట్ గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో దేశంలో జనసేన సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో వయస్సు, ఇతర కారణాల వల్ల చంద్రబాబు సీఎం పదవికి దూరమైనా బాబు తర్వాత ఆ పదవిని సమర్ధవంతంగా నిర్వహించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
2029 ఎన్నికల్లో జనసేన మరిన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉండగా ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తే కనీసం రెండున్నర సంవత్సరాలు అయినా పవన్ ముఖ్యమంత్రిగా పని చేసే ఛాన్స్ ఉంది. దీర్ఘకాలిక లక్ష్యాలతో పని చేస్తున్న పవన్ కు మోడీ సపోర్ట్ సైతం ఉండటంతో పాటు అవినీతి ఆరోపణలు లేని నేత కావడం అన్ని విధాలుగా కలిసొస్తోంది. ప్రస్తుతం అనధికారికంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ సీఎం పీఠాన్ని అధిరోహించడానికి ఎంతో సమయం పట్టదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తిరుగులేని మాస్ ఫాలోయింగ్ తో పాటు నిస్వార్థంగా సేవ చేసే గుణం, ప్రజాసేవ కోసం పవన్ చేసిన వెల కట్టలేని త్యాగాల వల్లే పవన్ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో సైతం పవర్ స్టార్ అయ్యారని పవన్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా కీలక శాఖలకు సంబంధించిన అన్ని బాధ్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు