
గతంలో రెండు సార్లు, ఇటీవల మళ్లీ విజయవాడకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీను కలిసి గుడివాడ అభివృద్ధికి నిధులు కోరిన రాము .. వేల కోట్లు వ్యయంతో కూడిన రెండు కీలక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చారు. గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల ఎండ్ టూ ఎండ్ అభివృద్ధి అలాగే గుడివాడ – కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం , ఈ రెండు ప్రాజెక్టులు గత పది ఏళ్లుగా ఫైళ్లలో మగ్గుతున్నవే! వాటిని అమలు దశలోకి తీసుకురావడమే రాము విజయాన్ని చాటుతోంది ... త్వరలో ప్రారంభం అవుతున్న అభివృద్ధి పధకాలు .. కేంద్ర నిధులతో మురుగునీటి నిర్వహణకు, రహదారుల అభివృద్ధికి పనులు మొదలవ్వబోతున్నాయి .
అదేవిధంగా రూ .8 కోట్లు విలువైన నగరంలోని రహదారులు, డ్రైనేజీలు అప్‌గ్రేడ్ చేసే పనులు కూడా మొదలు కాబోతున్నాయి .. “ఇంత స్పీడ్‌తో పనులు మొదలెట్టిన ఎమ్మెల్యేను మేం చూడలేదు. పైగా కేంద్రం నుంచి నిధులు తెచ్చిన తీరు చూస్తే రాబోయే రోజుల్లో గుడివాడ చక్కబడిపోతుంది!” అని స్థానికులు గర్వంగా చెబుతున్నారు. ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టడం కాదు … నిజంగా గ్రౌండ్ మీద ఉండే నేతగా రాము పేరు తెచ్చుకుంటున్నారు. వినియోగదారులకు కనిపించే అభివృద్ధే ఆయన స్టైల్. దీంతో పౌరుల మనసులు గెలుచుకుంటూ, తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన బేస్ వేసుకుంటున్నారు.