
దీని ద్వారా బైక్ హ్యాండిల్ ఆటో స్టీరింగ్ పట్టుకొని మహిళలు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రత్యేకించి మరి చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తోంది. డ్వాక్రా గ్రూపులలో ఉన్న సభ్యులు ఆసక్తి ఉన్నవారు బైక్, స్కూటీ ,ఆటోలను కూడా సబ్సిడీ ద్వారా అందించే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్నది. స్కూటీ బైక్ కు రూ .12000 రూపాయలు.. ఆటోకు రూ. 30 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబోతున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలకు జిల్లాలలో ఉండే మెప్మా అధికారులను సంప్రదించాల్సి ఉన్నది .
ఇప్పటికే 1000 ఎలక్ట్రిక్ వాహనాల స్కూటీలను కూడా కొనుగోలు చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆసక్తి ఉన్న మహిళలకు రాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని మరి వీరికి ఆర్డర్లను వచ్చేలా చేస్తున్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలో మొత్తం మీద 8 ప్రాంతాల్లో 500 లకు పైగా వీటిని నడుపుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఇలా బైకు పైన మహిళలు ప్రతినెల 15 నుంచి 20వేల లోపు ఆదాయం సంపాదిస్తున్నారట. ఇక ఆటోల ద్వారా అయితే 25 నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నారని తెలుపుతున్నారు. ఇవే కాకుండా మహిళల కోసం డ్రోన్లు కూడా సబ్సిడీ రూపంలో ఇచ్చేలా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయట. రాష్ట్రవ్యాప్తంగా 400 మందికి పైగా మహిళలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని పథకాల వల్ల డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది ఏపీ ప్రభుత్వం.