
జీ.హెచ్.ఎం.సి, హైడ్రా మోటార్లను ఉపయోగించి నీటిని దారి మళ్లించాయి. భారీ వర్షం వల్ల గురువారం రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు కిటకిటలాడాయని తెలుస్తోంది. నిన్న ఏకంగా 5 లక్షల కంటే ఎక్కువమంది మెట్రోలో ప్రయాణించారని సమాచారం అందుతోంది. రాబోయే మూడు రోజులు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని జలమండలి ఎండీ సూచనలు చేశారు.
ఇప్పటికే మంజూరు చేసిన సెలవులను సైతం రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునే దిశగా అధికారుల అడుగులు పడుతున్నాయి. వరద సహాయం అవసరమైన పక్షంలో కాంటాక్ట్ కావడానికి కొన్ని నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. ఆ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా వరద సహాయం పొందవచ్చు.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలను ఒకింత భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. భవిష్యత్తులో రోడ్లపై నీళ్లు నిలవకుండా తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు