చాలామంది సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడికి రాజకీయ అనుభవం ఎక్కువ. ఎవరిని ఎలా డీల్ చేయాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎంతలో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ఈ వయసులో కూడా సీఎంగా తన బాధ్యతలను పర్ఫెక్ట్‌గా నిర్వర్తిస్తున్నారు అని చాలామంది అంటున్నారు. నిజంగా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ అది నిజమే అనిపిస్తుంది. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ సిబ్బందితో ప్రవర్తించిన తీరు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఆయన తన అనుచరులతో కలిసి చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా అటవీ అధికారులపై ఆయన చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు కూడా దాడికి దిగడం పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అటవీ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మీడియా ముందు కూడా ఎమ్మెల్యే బుడ్డాకు సమాధానం చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది.


దోర్నాల–శ్రీశైలం రహదారిపై రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. నల్లమల అడవి ప్రాంతం టైగర్ రిజర్వ్ కావడంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహన రాకపోకలు నిషేధం అని అందరికీ తెలిసిందే. కానీ మంత్రి సంధ్యారాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న సమయంలో, ప్రకాశం జిల్లా నెక్కంటి అడవి పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో బుడ్డాఅ రాజశేఖర్ రెడ్డి ఆగ్రహానికి గురై, ఎమ్మెల్యే అయ్యి కూడా స్వయంగా అక్కడ ఉన్న అధికారులపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.



ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణకు దిగడం పార్టీ పరువు తీసేలా ఉందని మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతోనే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో చంద్రబాబు నిజాయితీ మరోసారి రుజువైంది. "మన వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం" అనే అభిమానం ఆయనపై ఎందుకు ఉందో మళ్లీ తేలిపోయింది. చంద్రబాబు నాయుడు తన మాటలకే కట్టుబడి పనిచేశారని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: