
ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఒక ఐపీఎస్ అధికారితో అరుణకు ఉన్న ఫోటోలు, వీడియోలు పోలీసులకు లభిస్తే, చాలా సున్నితమైన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు. అందుకే కోర్టు అనుమతి తీసుకుని ఆ ఫోన్లను అధికారికంగా తెరవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ పరిణామాలతో, అరుణతో సన్నిహితంగా మెలిగిన కొందరు పెద్దలు, అధికారులు, విద్యాసంస్థల ప్రధానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గూడూరు ప్రాంతానికి చెందిన ఒక పెద్ద విద్యాసంస్థ ప్రిన్సిపల్‌తో అరుణకు బలమైన అనుబంధం ఉన్నట్టు సమాచారం బయటకొచ్చింది. గత రెండు సంవత్సరాల కాల్ డీటైల్స్‌ను కూడా సేకరించి, పూర్తి స్థాయి దర్యాప్తు జరపడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే అరుణ ప్రియుడు, కరుడుగట్టిన నేరగాడు శ్రీకాంత్‌కు పెరవల్ మంజూరు చేయడంలోనూ ఆ ప్రిన్సిపల్ పాత్ర ఉందన్న సమాచారం బయటకు రావడంతో.. ఈ కేసులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు సమస్య ఏంటంటే.. అరుణకు చిన్ననాటి నుంచి ఒక అలవాటు ఉంది. ఆమె ఎవరితో ఫోన్‌లో మాట్లాడినా, వారి వాయిస్ రికార్డ్ చేసి, వారి ఫోటోలు, వీడియోలు సేకరించి పదిలంగా దాచుకుంటుంది. మొదట తీయని మాటలతో దగ్గరయ్యి, ఆ తరువాత వారి బలహీనతలను ఉపయోగించి, తనకు కావాల్సిన పనులు చేయించుకోవడం ఆమె నైజం. ఈ వ్యూహం వల్లే ఆమె పరిచయమైన చాలా మంది ప్రస్తుతం చిక్కుల్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న రికార్డింగ్స్, ఫోటోలు, వీడియోలు— ఇవన్నీ బయటకు వస్తే, పెద్దస్థాయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రౌడీషీటర్లు వరకు బహిర్గతం కావడం ఖాయం అని ప్రజలు చర్చించుకుంటున్నారు.