
డిసెంబర్‌లో మళ్లీ వచ్చి విద్యార్థుల డిమాండ్లను నెరవేరుస్తానని చెప్పినా, ఈ సందర్శనలో ఆయన ఏం సాధించారని నిలదీశారు. జార్జిరెడ్డి, గద్దర్‌లను కొనియాడటం ద్వారా రేవంత్ తన రాజకీయ ఉద్దేశాలను మాత్రమే సాధించారని, కానీ చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి హామీ ఇచ్చిన 500 కోట్లలో ఎంత ఇచ్చారో స్పష్టం చేయలేదని ఆరోపించారు. యూనివర్సిటీలో ఖాళీల భర్తీ, ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి జార్జిరెడ్డిని హీరోగా కీర్తించడం బాధాకరమని, ఆయన యూనివర్సిటీలో గన్ కల్చర్‌ను ప్రోత్సహించారని వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జార్జిరెడ్డి, గద్దర్‌లను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం, చంద్రారెడ్డి వంటి వారిని మరచిపోవడం రేవంత్ భావదారిద్ర్యాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. అర్బన్ నక్సలైట్ కంచె ఐలయ్యను ఓబీసీ అడ్వైజరీ కమిటీలో నియమించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నడుపుతోందని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టను రేవంత్ దిగజార్చారని, ఎబివిపి నేపథ్యం ఉన్న ఆయన స్వభావం బట్టబయలైందని వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఓయూ భూముల కబ్జా సమస్యను పరిష్కరించడంలో రేవంత్ విఫలమయ్యారని, వందేమాతరం రామచంద్రరావు వంటి వారిని గుర్తు చేయకుండా, విధ్వంసక రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఈ వివాదం రాష్ట్రంలో రాజకీయ చర్చలను మరింత రగిలించనుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు