దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ బరుస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలలో  ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రపక్షులు ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎన్నుకున్నారు.. దీంతో ఇండియా కూటమి అభ్యర్థులు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో  జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలంటూ కోరుతున్నారు.. దీంతో  వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇండియా కూటమికి మద్దతు పలకాలని అడిగారట..కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఇప్పటికే జగన్ ఎన్డీఏ మద్దతును కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఇండియా కూటమి అభ్యర్థి వైయస్ జగన్ కి ఫోన్ చేయడం గమనార్హం. తనకు మద్దతు ఇవ్వాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని సైతం జగన్ సున్నితంగానే తిరస్కరించారు.


ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతికి పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి తెలుగు వారు కావడం గమర్హం తన మద్దతు ప్రచారం కోసం తెలంగాణకి వచ్చారు. అలా హైదరాబాదులో నిన్నటి రోజున దిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. కొంతమంది నేతలతో కూడా మాట్లాడారు. అలాంటి సమయంలోనే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వాలని వైయస్ జగన్ ని కోరినప్పటికీ తాము గతంలో ప్రకటించిన ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణకు మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు.


ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి చేసినటువంటి విజ్ఞప్తికి మాజీ సీఎం జగన్ స్పందిస్తూ.. "మీరంటే చాలా గౌరవం ఉన్నది.. కానీ మద్దతు ఇవ్వలేమంటూ సమాధానం ఇచ్చారు .ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే.. ఎన్డీఏ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి కోరారని.. దీంతో తాము రాధాకృష్ణ కి మద్దతు ఇస్తామంటూ  మాట ఇచ్చామంటూ తెలిపారు జగన్. వ్యక్తిగతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన చాలా అపారమైన గౌరవం ఉన్నదని ఆయన సేవలు దేశానికి, రాజ్యాంగ పరిరక్షణకు  అవసరమంటూ తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వలేమంటూ ఫోన్లో బదులిచ్చారు".

మరింత సమాచారం తెలుసుకోండి: