అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం విధిస్తున్న ఆంక్షలు వల్ల భారతీయ నిపుణులలో తీవ్రఆందోళన కనిపిస్తోంది. ఇదిలా ఉండగా కొంతమంది బ్లైండ్ యాప్ ద్వారా అక్కడ భారతీయులు ఉద్యోగం కోల్పోతే ఏం చేస్తారు ? అంటూ సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వహించగా.. సుమారుగా 45 శాతం మంది ఇండియాకు వెళ్లి పోతామని.. మరో 26 శాతం మంది మరో ఉద్యోగం కోసం ఇతర దేశానికి వెళ్తామని.. 29 శాతం తటస్థ పరిస్థితిలో ఉన్నారు. అయితే వీరందరిలో కూడా కొన్ని కీలకమైన పాయింట్స్ తెలియజేశారు.


ముఖ్యంగా అమెరికాను వీడడానికి ప్రధాన కారణాలు.. జీతాలలో కోతలు అంటూ 25 శాతం మంది చెప్పారు.

జీవించడానికి అక్కడ సరైన వసతులు లేకపోవడం అంటూ 24% మంది తెలిపారు.

మరి 13 శాతం మంది కుటుంబ సమస్యలు

మరో 10 శాతం మంది తక్కువగా అవకాశాలు ఉన్నాయని.

ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే యూఎస్ఏ వర్క్ వీసాను ఎంచుకుంటారా అంటూ ప్రశ్నించగా? అందులో 35% మంది సముఖత తెలియజేసినప్పటికీ..  మిగిలిన 65 శాతం మంది చెప్పలేమని ఎటు తేల్చుకోలేని సమాధానాలను తెలుపుతున్నారు.


ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం పోతే 60 రోజులలోపే అమెరికా నుంచి బహిష్కరించబడతారనే విషయంపై 35 శాతం మంది అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ విషయాన్ని తమకు లేదా తమకు తెలిసిన వారి అనుభవం ఆధారంగా తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక నిషేధం కూడా ఉంటుందేమో అని భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ భారతీయ ఉద్యోగులు. అయితే అక్కడ న్యాయవాదులు మాత్రం ఉద్యోగం పోయిన వెంటనే అమెరికాను వీడితే ఎలాంటి ముప్పు ఉండదంటూ సలహా ఇస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇప్పటికే టెక్ కంపెనీలలో భారతీయులను నియమించుకోవడం ఇక ఆపేయాలి అంటూ నోటీసులను కూడా జారీ చేశారు. ఈ విషయం వల్ల 63% మంది తమ సంస్థలకు లాభం చేకూరుతుందని అక్కడ నిపుణులు అభిప్రాయంగా తెలుపుతున్నారు. కానీ తమకు మాత్రం నష్టం జరుగుతుందని భారత్ కు చెందిన 69% మంది వర్కర్లు ఆందోళన చెందుతున్నారు.


అలాగే లాటరీ విధానంలో మార్చాలని ప్రణాళికలను కూడా ఈ ఏడాది ఆగస్టు నుంచి తీసుకువచ్చింది అమెరికా.. 2021లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగిందట. ఈ పద్ధతి ద్వారా గ్రాడియేటర్లకు తీవ్ర నిరాశని కలిగిస్తోంది. ప్రతి ఏడాది కూడా H 1 -B క్యాప్ ప్రకారం 85 వేలమందికి వీసాలు దక్కుతున్నాయి.. అయితే ఇందులో 65, 000 సాధారణ దరఖాస్తులు ఉన్నప్పటికీ మిగిలిన 20 వేలు యూఎస్ మాస్టర్ డిగ్రీ అంతకంటే ఎక్కువ స్థాయిలో చదివిన వారికి మాత్రమే చెందుతున్నాయి.. ఇలా పరిమితికి మించి దరఖాస్తు వచ్చినట్లు అయితే లాటరీ విధానంలో వారికి వీసాలు కేటాయిస్తారట . ప్రస్తుతం ఈ పద్ధతిని టెక్నాలజీ సంస్థలు అక్కడ ఎక్కువగా వినియోగించుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: