
సీఎం చంద్రబాబుతో మంత్రులు భేటీ అయి ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ పాలసీని ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరం రూ .25 లక్షల వరకు ఆరోగ్య భీమా లభించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 2493 నెట్వర్క్ ఆసుపత్రులలో రూ .25 లక్షల రూపాయల వరకు ఉచితంగానే 3257 రకాల వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ పాలసీ వల్ల 1.63 కోట్ల మంది కుటుంబాలకు లబ్ధి చేరుతుంది. కేవలం 6 గంటలలోపే వైద్య చికిత్సకు సంబంధించిన అనుమతి పత్రాలు కూడా లభిస్తాయి.రూ.2.5 లక్షల లోపు ఉంటే అదంతా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కంపెనీల కిందికి వస్తాయి.. రూ.2.5 లక్షల పైన నుంచి రూ .25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా అందిస్తారు.
అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బకాయిలు చాలానే ఉన్నాయి.. అటు వైసీపీ ప్రభుత్వంలో ఇటుకూటమి 15 నెలల ప్రభుత్వ పాలనాల మొత్తం కలిపి రూ.2500 కోట్ల రూపాయల బకాయిలు హాస్పిటల్స్ కు చెల్లించాల్సి ఉంది. ఆ విషయం మీద హాస్పిటల్ యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ నిలిపి వేస్తున్నామంటూ ఒక లేఖ రాశారు.. హాస్పిటల్ యాజమాన్యుల భయం ఏమిటంటే.. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వచ్చిందంటే.. వాటి కింద మాత్రమే ఆపరేషన్ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే డబ్బులు వస్తాయి. అయితే మిగిలిన పాత బకాయిలు రూ.2,500 కోట్లు ఎవరు చెల్లిస్తారు? కొత్త పాలసీ వచ్చిందంటే ఇక పాత బకాయిలు ఎవరు అడగరు.. అందుకే సరైన సమయం చూసి హాస్పిటల్ యాజమాన్యాలు ఇప్పుడు ఆపుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. కేవలం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాత్రమే సంబంధం ఉంటుంది. అందుకే పాత బకాయిలను కోల్పోయే అవకాశం ఉందని భయంతో ఇలా చేస్తున్నారు.