
టాలీవుడ్‌లో ఈ యేడాది సరైన హిట్లు లేక థియేటర్లు వెళవెళ బోతున్నాయి. ఈ క్రమంలోనే వార్ 2, కూలీ లాంటి రెండు పెద్ద సినిమాలు నిరాశ పరిచిన తర్వాత ఘాటీ, మదరాసి కూడా అంచనాలు అందుకోలేక పోయినా ..ఆ రెండు సినిమాలకు ఒక రోజు ముందుగానే థియేటర్ల లోకి వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా రెండో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర దంచి కొడుతోంది. ‘ లిటిల్ హార్ట్స్ ’ చిన్న సినిమా గా మొదలైనా ప్రేక్షకుల మనసులను గెలుచుకొని బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయంతో దూసుకు పోతోంది. కేవలం రు. 2.5 కోట్ల చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా లో మౌలి తనుజ్, శివాని నాగారం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సాయి మార్తాండ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
ఇక తొలి వారమే అదర గొట్టేసిన ఈ సినిమా ఇప్పటికే రెండో వారం లోకి అడుగుపెట్టినా వసూళ్ల జాతర అపలేదు. విడుదలైన మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 32.15 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రిలీజ్‌కి కేవలం 10 రోజుల్లోనే ఇంతటి ఘనవిజయం సాధించడం నిజంగా చాలా పెద్ద హిట్ అని చెప్పాలి. ఈ సినిమా బడ్జెట్‌కు వస్తోన్న వసూళ్లకు పొంతనే లేదు. అంత పెద్ద హిట్ అయ్యింది. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, జై కృష్ణ, నిఖిల్ అబ్బూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. సంగీతాన్ని సింజిత్ యెర్రమిల్లి సమకూర్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు