
అదే రూట్‌లో మరో సీనియర్ స్టార్ నాగార్జున కూడా అడుగులు వేసాడు. టాలీవుడ్‌లో టాప్ ఫోర్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున ఎప్పటికీ చాక్లెట్ బాయ్, మన్మధుడు, స్టైలిష్ హీరోగా పాపులర్ అయ్యాడు. అలాంటి స్టార్ హీరో కూడా విలన్ పాత్రలు చేస్తాడా? అన్న ఆశ్చర్యం మొదట్లో అభిమానుల్లో కనిపించింది. కానీ ఆయన చేసిన నెగిటివ్ రోల్‌లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో ఆ షాక్ ఒక్కసారిగా ఆప్రిసియేషన్‌గా మారిపోయింది. నాగార్జున కూడా ఇప్పుడు "హీరోయిజం" కంటే "క్యారెక్టరైజేషన్"కి ప్రాముఖ్యత ఇస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తాజాగా ఈ లిస్టులో చేరిపోయాడు మంచు మనోజ్. చాలా కాలం పాటు ఫ్లాపులు కారణంగా ఆయన కెరీర్ డల్ అయిపోయింది. కానీ ఇటీవల వచ్చిన "మిరాయి" సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్ర మాత్రం పూర్తిగా గేమ్ ఛేంజర్ అయింది. ఈ పాత్ర కోసం ఆయన చేసిన స్తంట్స్..కష్టపడటం, డెడికేషన్ స్పష్టంగా స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఆయన తన కెరీర్‌కి కొత్త ఊపును తెచ్చుకున్నాడు.
ఇప్పుడు అందరిది ఒక్కటే ప్రశ్న..ఎందుకు టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఒక్కరొక్కరుగా తమ హీరో ఇమేజ్‌ను పక్కనబెట్టి నెగిటివ్ షేడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు? దానికి ప్రధాన కారణం – పెరిగిపోతున్న కాంపిటీషన్. ప్రతి రోజు కొత్త కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఒకరు హీరోగా నిలబడటం, విజయవంతంగా కొనసాగడం అంత తేలిక కాదు. అందుకే కొంతమంది హీరోలు తమను ప్రత్యేకంగా చూపించుకోవడానికి విలన్ లేదా నెగిటివ్ రోల్‌లలో కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఆడియన్స్‌కి ఇప్పుడు కేవలం హీరోయిజం, స్టైల్, డాన్స్, ఫైట్లు సరిపోవడం లేదు. కంటెంట్‌లో వైవిధ్యం, క్యారెక్టర్‌లో కొత్తదనం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది.
జగపతిబాబు, నాగార్జున, మంచు మనోజ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ, టాలీవుడ్‌కి కొత్త అర్థాన్ని తీసుకొస్తున్నారు. వారు చూపిస్తున్న ఈ ధైర్యం మిగతా హీరోలకు కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌గా మారుతోంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఇదే. "నెక్స్ట్ ఈ లిస్ట్‌లో వచ్చే హీరో ఎవరు?" అన్నదే. ఎవరు తమ హీరోయిజాన్ని పక్కనబెట్టి, విలన్ గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తారు అన్నది నిజంగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్‌గా మారింది.