ఒక వ్యక్తి ఏ రంగంలోనైనా పైకి ఎదగడం ప్రారంభిస్తే, అతడిని ప్రోత్సహించే వారు ఎంతమంది ఉంటారో, దానికి డబుల్ కాదు, ట్రిపుల్ స్థాయిలో కిందకి లాగాలని చూసే వారు కూడా ఉంటారు. ఇది కేవలం మన చుట్టుపక్కల మాత్రమే కాదు, ప్రతి రంగంలోనూ కనిపించే వాస్తవం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక హీరో లేదా సినిమా సక్సెస్ సాధిస్తే, కొంతమంది మాత్రం దాన్ని హర్షించడం కంటే తప్పులు పట్టడమే పని చేసుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది ‘మిరాయి’ సినిమా. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. మాస్ ఆడియెన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సినిమా విజువల్స్, కథ, ఎమోషన్స్ అన్నీ బావున్నాయని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.


అసలు పరిస్థితి ఏంటంటే ..  సినిమా సక్సెస్ అయిన తర్వాత చాలామంది తెలుగు స్టార్ హీరోలు తేజ సజ్జాను ప్రశంసిస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. ఒక్కరు ఇద్దరు తప్పితే, మిగతా టాప్ హీరోలు మాత్రం మిరాయి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చిన్న విషయాలకైనా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ ఉండే ఒక టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ సినిమా గురించి పట్టించుకోకపోవడం షాకింగ్‌గా మారింది.



అదే సమయంలో సోషల్ మీడియాలో "మిరాయి సినిమా కథ మొత్తం కృష్ణ సినిమాకి కాపీ" అని రూమర్స్ వచ్చాయి. దీనిని ఆధారంగా చేసుకుని కొంతమంది కావాలనే సినిమాను డౌన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సినిమా చూసిన చాలా మంది మాత్రం ఇది కాపీ కాదు, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చాలా కష్టపడి రూపొందించిన ఒరిజినల్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ఇంతలోనే ఒక స్టార్ హీరో చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. “టాలెంట్ లేదు… బొక్క లేదు… ఈ సినిమా అంతా కాపీ, బూటకం తప్ప ఇంకేమీ లేదు” అని మాట్లాడినట్టు ఫిలింనగర్ టాక్. ఈ మాటలు బయటికి రావడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.



ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వార రెస్పాండ్ అవుతున్నారు. “సినిమాలో ఒకటి రెండు కాపీ సీన్స్ ఉండొచ్చు కానీ మొత్తం సినిమా కాపీ అని చెప్పడం దారుణం.”“కనీసం ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తొక్కేయడం అవసరమా?” ..“కార్తీక్ ఘట్టమనేని కష్టాన్ని చూస్తేనే తెలుస్తుంది, ఆయన విజువల్స్ స్థాయి అంత ఈజీ కాదు.”...అంతేకాదు, చాలామంది ఫ్యాన్స్ “ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం తొక్కకుండా ఉండాలి. వాళ్లకి భవిష్యత్తు ఉంది, వారిని కిందకు లాగొద్దు” అని రిక్వెస్ట్ చేస్తున్నారు.



ప్రస్తుతం సోషల్ మీడియాలో మిరాయి సినిమా గురించి ఒక పక్క పాజిటివ్ టాక్, మరో పక్క నెగిటివ్ టాక్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఒక వైపు సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతుండగా, మరో వైపు స్టార్ హీరోల మధ్య ఇలాంటి కామెంట్స్ వలన సినిమా చుట్టూ పెద్ద రచ్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: