అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పైన మరొక బాంబు పేల్చారు.. అమెరికాకు ఎగుమతి చేసే ఫార్మాన్యూటికల్ ఉత్పత్తుల దిగుమతులపై 100% టారిఫ్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అటు భారత్ డ్రగ్ కంపెనీలపైన తీవ్ర ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ట్రంప్ వ్యవహరిస్తున్న టారిఫ్ల పైన భారత్ తో సహా అన్ని దేశాలను కూడా ఇబ్బందులు కలిగించేలా చేస్తున్నారు. రష్యా తో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలన్నిటి పైన కూడా ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇండియా పైన ఇప్పటికే 50% వరకు అదనపు టారిఫ్ లను విధించారు ట్రంప్. మొదట 25 శాతంతో సరిపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ 25% పెంచి 50 శాతం టారిఫ్ అంటూ ఇండియా పైన భారం మోపారు. ఇప్పుడు మళ్లీ ఫార్మా రంగం పైన 100% వరకు టారిఫ్ విధించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ట్రంప్. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందినటువంటి ఫార్మా న్యూట్రికల్ ఉత్పత్తుల పైన ఇక 100% టారిఫ్ అమలు చేస్తున్నామంటూ తెలియజేశారు

ఒకవేళ డ్రగ్ కంపెనీలు తమ తయారీ ప్లాంట్లను సైతం అమెరికాలో నిర్మిస్తే మాత్రం వాటికి మినహాయింపు ఉంటుంది అంటూ (నిర్మాణం ప్రారంభించడం, నిర్మాణంలో ఉంచడం వంటి వాటికి మినహాయింపు) స్పష్టం చేశారు. ఫార్మా రంగం పైనే కాకుండా మరికొన్ని ఉత్పత్తుల పైన కూడా ట్రంప్ భారీగా సుంకాలను ప్రకటించారు. కిచెన్ క్యాబినెట్ల పైన 50 శాతం, ఫర్నిచర్స్ పైన 30%, ట్రక్కులు పైన 25% వరకు పన్నులు ఉంటాయంటూ వెల్లడించారు. ఇండియాకు అమెరికా అతిపెద్ద విదేశీయ మార్కెట్ గా నిలిచింది.. కానీ ఈ ఏడాది తొలి ఆరు నెలలలోనే 32,505 కోట్ల రూపాయల మేర ఫార్మా ఎగుమతులు కాగా ఇప్పుడు వాటన్నిటి మీద కూడా పెద్ద దెబ్బ పడేలా కనిపిస్తోంది. దేశం మొత్తం ఫార్మా ఎగుమతిలలో అమెరికా వాటా 40 శాతం వరకు ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: