బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి మాట్లాడిన తీరు ఒక్కసారిగా అటు మెయిన్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలకృష్ణ మాట్లాడిన తీరుకి చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ కూడా వైరల్ అయింది.అయితే చిరంజీవి అంత తొందరగా రెస్పాండ్ అవ్వడంతో చాలామంది వైసిపి వాళ్లు చిరంజీవిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు. ఆ రోజులు లేవని నోరు ఈరోజు ఎందుకు లేస్తుంది అని కడిగిపారేస్తున్నారు. మరి ఇంతకీ వైసీపీ వాళ్లు చిరంజీవిని అడిగే ఆ ప్రశ్న ఏంటి అంటే గతంలో పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని అవమానించారని, తన అన్నతో దండాలు పెట్టించుకున్నాడని తన అన్న కారుని లోపలికి కూడా రానివ్వకుండా గేటు బయట ఆపేసి నడుచుకుంటూ రమ్మని చెప్పించాడని, మా అన్న ఎంత గొప్పోడో నీకు తెలుసా.. ఆయనతో దండాలు పెట్టించుకుంటాడా అంటూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

అయితే ఆ సమయంలో చిరంజీవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడితే మాత్రం వెంటనే స్పందించి అలాంటిదేమీ లేదు జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు అన్నారు.అయితే ఇదే విషయంపై వైసీపీ వాళ్లు చిరంజీవికి సూటి ప్రశ్న వేస్తున్నారు.ఆరోజు పవన్ కళ్యాణ్ అన్ని సార్లు గొంతు చించుకొని మా అన్నను అవమానించారు.. మా అన్నని అవమానించారు.. అంటే ఒక్కసారి కూడా మీ గొంతు లేచి నన్ను జగన్ అవమానించలేదు సాదరంగా ఆహ్వానించారు అని ఎందుకు చెప్పలేదు. అంటే ఆరోజు మిమ్మల్ని అవమానించారు అనే సింపతీని అడ్డుపెట్టుకొని మీ తమ్ముడికి ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతోనే నోరు కట్టుకొని కూర్చున్నారా..ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి తమ్ముడు గెలిచాడు కాబట్టి బాలకృష్ణ మాట్లాడిన మాటలపై రియాక్ట్ అవుతున్నారు..

ఆనాడు లెవ్వని నోరు ఈనాడు ఎందుకు లేస్తుంది? ఆరోజే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు జగన్ నన్ను అవమానించలేదని చెప్పి ఉంటే బాగుండేది కదా.. పవన్ లేనిపోని విమర్శలు జగన్ పై చేసినప్పుడు చిరంజీవి గప్ చుప్ గా ఉన్నారు. ఇప్పుడు మాత్రం నోరు విప్పుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఆరోజు తమ్ముడు మాటలకు కాలలేదు కానీ ఇప్పుడు బాలకృష్ణ ఒక్క మాట అంటే అంత కాలిందా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో చిరంజీవిని కూడా కొంతమంది తప్పు పడుతున్నారు.జగన్ అంత గౌరవంగా ఆహ్వానించినప్పుడు తమ్ముడు అన్ని మాటలు మాట్లాడిన సైలెంట్ గా ఉన్నాడు కానీ ఇప్పుడు బాలకృష్ణ అనేసరికి మాత్రం రియాక్ట్ అయ్యారు.అంతా తమ్ముడు గెలుపు కోసమే సైలెంట్ గా ఉన్నారు అని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: