తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ సుముఖత చూపించడం లేదు. మొన్నటి వరకేమో బీసీ రిజర్వేషన్లు డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెబుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి  దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కానీ ఈ బిల్లు గవర్నర్ దగ్గర ఆగిపోయింది.. ఇప్పటికే సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ నిర్వహించాలని హై కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్స్ కు వెళ్దామని ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసింది. 

పార్టీ పరంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ సీట్లు కేటాయించింది. ఈ క్రమం లోనే కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. గవర్నర్ వద్ద బీసీ బిల్లు పెండింగ్లో ఉండగానే రిజర్వేషన్స్ ఎలా ఇస్తారని పిల్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్ 7న తీర్పు వెలువడనుంది. అయితే ఈ విషయం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. కోర్టు 42 శాతం రిజర్వేషన్ వద్దని చెప్పి పాత లెక్క ప్రకారమే ఎలక్షన్స్ కి వెళ్లాలని ఆదేశిస్తుంది.. 

 ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కి ముందే తెలుసు కాబట్టి  ప్రజల్లో సింపతి సంపాదించుకోవడానికి మేము 42 శాతం రిజర్వేషన్ ఇచ్చినా ఇతర పార్టీల వారు కొర్టు కు వెళ్లి దాని ప్రకారం ఎలక్షన్స్ వద్దంటున్నారు. మేము బీసీలకు సపోర్ట్ చేస్తున్నా ఇతర వ్యక్తులు అడ్డుపడుతున్నారని చెప్పడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. ఈ విధంగా వీళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోర్టునే వాడుకుంటుందని చెప్పవచ్చు. మరి చూడాలి రేవంత్ సర్కారు వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా.. 7 వ తేదీ న కోర్టు ఏం తీర్పు ఇస్తుంది అనేది ముందు ముందు తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: