ప్రస్తుతం తెలంగాణ లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైపోయింది.స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ కూడా ఉండడంతో అందరి చూపు వీటిపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వార్తలు ఎక్కువగా మెయిన్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా బిజెపి, బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సడన్గా టిడిపి కొత్త వాదనలు తెరపైకి తీసుకువస్తుంది. అదేంటంటే టీటీడీపీకి చెందినటువంటి ఇద్దరు ముగ్గురు నేతలు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి మనం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేద్దాం అని చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారట. అవి ఉత్తుత్తి మంతనాలు కావు. ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు చేస్తున్న మంతనాలు. తెలంగాణ టిడిపి నేతలు జనసేనతో కలిపి పోటీ చేద్దాం అని అంటున్నారట.అయితే ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా లేవనెత్తడానికి కారణం భవిష్యత్తు రాజకీయాల కోసమే అని తెలుస్తోంది.

 ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అసలు  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మాట కూడా మాట్లాడని చంద్రబాబు నాయుడు ఇప్పుడెందుకు సడన్గా ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నాడు అనే డౌట్ చాలా మందిలో ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో ఏపీలో ఉన్నట్టే తెలంగాణలో కూడా బిజెపితో పొత్తు కంటిన్యూ చేయాలని చూస్తున్నారట. అయితే ఇప్పటికే ఏపీలో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుంది.ఈ నేపథ్యంలోనే టిడిపి జనసేన కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేద్దాం అని టీటీడీపీ నాయకులు చెప్పినప్పటికీ చంద్రబాబు ఉప ఎన్నికకి దూరంగా ఉందాం బిజెపికి అడిగితే మద్దతు ఇద్దాం అని చెబుతున్నారు. అయితే ఇలా బిజెపికి సానుకూలంగా మాట్లాడడానికి కారణం భవిష్యత్తులో కూడా తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొన్ని సీట్లను అడిగి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక  గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఇప్పుడు మేం బిజెపి కోసమే జూబ్లీహిల్స్ లో పోటీ నుండి తప్పకున్నట్టు ఓ డ్రామా చేసి మా మద్దతు బిజెపికే అని, బీజేపీ కోసం త్యాగం చేసినట్టు మాట్లాడితే కనీసం వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయినా బిజెపి తెలంగాణలో టీడీపీ తో పొత్తు పెట్టుకుని వారికి కొన్ని సీట్లు కేటాయిస్తుంది అనే ఆశతోనే చంద్రబాబు ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి బిజెపికి మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా టీటీడీపీ నేతలు జూబ్లీహిల్స్ లో పోటీ చేద్దాం అని చెప్పినప్పటికీ చంద్రబాబు వారికి సర్ది చెప్పి బిజెపికి సపోర్ట్ చేయండి అని బిజెపి కోసం త్యాగం చేస్తున్నాం అని బిజెపి అధిష్టానానికి అర్థం అవ్వాలి అని పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారు అంటూ పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఉపఎన్నిక కోసం త్యాగం చేసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిజెపితో బేరసారాలు ఆడడం కోసమే చంద్రబాబు ఈ ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ఇక ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి నుండి ముగ్గురు అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి వెళ్లాయి.అలాగే కాంగ్రెస్ నుండి ఇద్దరు అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి చేరాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరణించిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: