
ముఖ్యంగా చిరంజీవిని చూస్తుంటే 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తారేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆయనను చూస్తే ఈ అందం దేవుడిచ్చిన వరమా లేక ఆయన తన ఆరోగ్యం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలా? అనేది తెలియదు కానీ 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్ర హీరోలాగే కనిపిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఒక ఫోటోషూట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక అయిదారు కాస్ట్యూమ్స్ మార్చి మరీ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే అసలు చిరంజీవి వయసు ఎంత అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఇలా ఈయన సడన్గా ఈ ఫోటోషూట్ నిర్వహించడానికి కారణం ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల పాట ప్రోమోలో చిరంజీవి స్టైలిష్ డ్రెస్సులు, లుక్స్ మీద పాజిటివ్ తో పాటు నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. అందుకే వాటికి చెక్ పెట్టాలనో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఇలా ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించి మరీ ఫోటోలు షేర్ చేశారు. మొత్తానికైతే చిరంజీవి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారడంతో అభిమానులు కూడా మీ స్ట్రాటజీ ఏంటి బాస్.. ఈ వయసులో కూడా ఇంత యంగ్గా ఎలా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అటు స్టైల్ ని మెయింటైన్ చేయడంలో ఇటు ఫిట్ గా ఉండడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..