
తాజాగా నిపుణులు సైతం తెలియజేస్తున్న ప్రకారం బంగారం ధర రాబోయే రోజుల్లో రూ.3 లక్షల రూపాయల వరకు చేరుతుందట. మొన్నటిదాకా 4200 డాలర్లు ఉండగా, ఇప్పుడు ఏకంగా 4900 డాలర్ల వరకు వెళ్ళింది. 2030 సంవత్సరం నాటికి ఔన్స్ బంగారం ధర 150 % వరకు పెరిగి 10వేల డాలర్ల వరకు చేరుతుందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణుడు ఎడ్ యార్దేని అంచనా వేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ .3 లక్షల రూపాయలకు దాటవచ్చని అంచనా తెలియజేస్తున్నారు.
ఇందుకు గల కారణాలను తెలియజేస్తూ అంతర్జాతీయంగా ఆర్థిక ,రాజకీయ,భౌగోళిక కారణాలు ప్రపంచ దేశాలు బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ ఉండడంతో పాటుగా గతంలో కంటే అత్యధికంగా ఇన్వెస్టర్లు బంగారం పైన ఆసక్తి కనపరచడం వంటివి చేస్తున్నారని అందువల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయని తెలియజేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లలో కూడా పసిడి ధర సరికొత్తగా మారుతున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.700 రూపాయలు పెరిగి రూ.1,24,000 వేల రూపాయలకు చేరింది. అమెరికా వంటి రాజకీయ , ఆర్థిక నిశ్చితులతో పాటు ఫెడ్ రేట్లు మరింత తగ్గవచ్చు అనే అంచనా వల్లే బంగారం ధరలు కూడా పైపైకి పెరుగుతున్నాయని తెలియజేస్తున్నారు.