ఈ విషాదకర ఘటనపై దేశంలోని అగ్ర నాయకులు కూడా స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాదంపై తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. “కర్నూలు బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని రాష్ట్రపతి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రకటించారు. అంతేకాదు, ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి సంపూర్ణ స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.మోడీ స్పష్టంగా “ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? బస్సు సాంకేతిక పరంగా సరిగా ఉందా? డ్రైవర్ తప్పిదమా లేదా రోడ్డు పరిస్థితులవల్లా?” వంటి విషయాలను తక్షణమే నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు.
ఎక్స్గ్రేషియా పట్ల మార్గదర్శకాలు:
సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఎక్స్గ్రేషియా నిబంధనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం నిజమైన కుటుంబ సభ్యులకు మాత్రమే అందేలా పలు కండిషన్లు విధించినట్లు తెలుస్తోంది.మృతుల కుటుంబ సభ్యులు తమ ఆధార్, ఓటరు గుర్తింపు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు సమర్పించిన తర్వాతే ఆర్థిక సాయం అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎవరైనా మోసపూరితంగా ఆర్థిక సాయం తీసుకోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తగా భావిస్తున్నారు.
ఈ ప్రమాదం దేశ వ్యాప్తంగా ఆందోళన రేపింది. సామాజిక మాధ్యమాల్లో సాధారణ ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “ఈ ఘటన మళ్లీ జరగకూడదు”, “ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలు చేయాలి” అని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా అధికారులు, పోలీసులు సంఘటన స్థలంలో తక్షణ చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదం రాష్ట్రాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా హృదయ విదారక ఘటనగా నిలిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి