జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకోలేదు. అయితే బీఆర్ఎస్ తరఫున పీ. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీగా నామినేషన్ వేయబడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. చివరికి మాగంటి సునీత నామినేషన్ ఆమోదం పొందడంతో విష్ణువర్ధన్ రెడ్డి నామినేష‌న్ డ‌మ్మీ అయ్యింది. మొత్తం 81 నామినేషన్లు స్వీకరించగా భారీగా నామినేషన్లు తిరస్కరించిన‌ట్టు తెలుస్తోంది. పోటీలో ఎంత మంది ఉన్నా పోరు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా వస్తుందన్న చ‌ర్చ‌లు ఉన్నాయి. అయితే వాస్తవ పోటీ మాత్రం ముఖ్యంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యే కేంద్రంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ ఈ సీటు నుంచి తిరిగి తమ ప‌ట్టు నిలుపుకోవాలని సంకల్పంతో ఉంది; అందుకే పార్టీ ఫీల్డింగ్‌లో రిస్క్ తీసుకోకుండా సంప్ర‌దాయ రీతిలోనే అభ్యర్థిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.


ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికను మంచి చాన్స్‌గా చూస్తోంది. గత ఉపఎన్నికలలో కొంతకాలం పాటు కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురైనా ... ఈసారి పరిస్థితులు మారినట్టు కనిపిస్తున్నాయి. మ‌జ్లిస్ పార్టీ మద్దతు, స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యక్తిగత బలం మరియు రాజకీయ సమీకరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మ‌జ్లిస్ మ‌ద్ద‌తు ఉండటం కూడా తమకు కీలక బూస్ట్ అయ్యే అవకాశాన్ని తెచ్చింది. బీజేపీ వైపు చూస్తే ఈ ఉప ఎన్నిక‌ల విష‌యంలో ముందు నుంచి ఆ పార్టీ దూకుడుగా లేదు. అస‌లు అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయడమే ఇందుకు సంకేతమవుతుంది. పార్టీ నేతలు ప్రచారంలోకి దూకుతున్నప్పటికీ, స్థానికంగా   బీజేపీ పక్షానికి ఆద‌ర‌ణ క‌ప‌డ‌డం లేదు. ఇందుకు చాలా కార‌ణాలు కనిపిస్తున్నాయని ప్రచార విశ్లేషణలు చెబుతున్నాయి. అదే తరవాత బండి సంజయ్ జాతీయ స్థాయిలో చేసిన వ్యాఖ్యలు మైనార్టీ ఓట్ల సెంట్రలైజేషన్ అంశంలో చర్చలకు కారణమయ్యాయి.


మొత్తంగా ఈ జూబ్లిహిల్స్ పోరాటంలో ఎంత మంది పోటీ చేస్తున్నా.. ఎన్ని ప్ర‌ధాన పార్టీలు రేసులో ఉన్నా ముఖాముఖి గా మారింది. నామినేషన్ల సంఖ్య, పార్టీ స్ట్రాటజీలు, మైనార్టీ మద్దతు మరియు స్థానిక అభ్యర్థుల వ్యక్తిగత బలం ఈ బైపోల్ ఫలితాన్ని దిశానిర్దేశం చేస్తాయి.  అంతిమంగా జూబ్లిహిల్స్ ఓట‌రు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: