కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం అనే దానికంటే డ్రైవర్ నిర్లక్ష్యమని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. అందులో మొదటి విషయం ఏమిటంటే ఒకటి మొదటి నుంచి ఈ బస్సు నడిపే డ్రైవర్ అడ్డదిడ్డంగా నడిపేటువంటి అలవాటు ఉన్నది. అలాంటి ర్యాష్ డ్రైవింగ్ తో బైక్ మీద వెళుతున్న యువకుడి బండిని బస్సు ఢీ కొట్టడం జరిగింది. అక్కడ స్పాట్లోనే బైక్ నడుపుతున్న యువకుడు కూడా మరణించాడు. ఆ బండి బస్సు కిందుకు వెళ్లడంతో బస్సుకు పెద్ద ఎత్తున మంటలు రావడంతో బస్సును అక్కడే వదిలేసి పారిపోయారు డ్రైవర్.
అయితే అలా స్లీపర్ కింద మార్చే పనేమో ఒరిస్సాలో, పర్మిషనేమో డయుడామన్ లో, రిజిస్ట్రేషన్ అయింది ఏమో మొదట తెలంగాణలో,అంతేకాకుండా ఈ బస్సుకి ఇప్పటికీ 25 పైగా చలానాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. బస్సులో పాటించాల్సిన ఏ నిబంధనలు కూడా పాటించలేదనే విషయం ఇప్పుడు వినిపిస్తోంది .ఇందులో 43 సీట్లకు(సిట్టింగ్ బస్సుగా )తీసుకున్న పర్మిషన్ ఏకంగా స్లీపర్ కోచ్ బస్సు గా మార్చేశారు. మరి వీటి పైన ప్రభుత్వం విచారణ చేయబడుతుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి