ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చేసుకుంటున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని పైన పలు రకాల ఆరోపణలు చేశారు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి. ఈ వ్యవహారం ఇప్పుడు టిడిపిలో కూటమిలో హాట్ టాపిక్ గా మారింది.ఈ వ్యవహారం పైన మాజీ మంత్రి వైసిపి నేత పేర్ని నాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి అనే వ్యక్తి ఎవరో టీవీలో చూడడం తప్ప నాకు పరిచయం లేదు. ఎంపీ చిన్ని చెప్పినట్లుగా కొలికపూడి నాతో మాట్లాడితే.. ధైర్యంగా మాట్లాడుతున్నానని చెబుతాను.. నాకేమీ చిన్ని అంటే భయం లేదంటూ తెలిపారు వైసీపీ నేత పేర్ని నాని.



కానీ ఎమ్మెల్యే కొలికపూడి మాత్రం ఎంపీ కేసునేని చిన్నిని ఉతికి ఆరేశారు. హైదరాబాదులో చేసిన పాపాలన్నీ కూడా బయటపెట్టారు.పేకాట తప్ప ఏ ఆట రాని వ్యక్తి కేశినేని చిన్ని అంటూ ఫైర్ అయ్యారు. ఆయనకి ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇవ్వడం మరింత ఆశ్చర్యమంటూ తెలిపారు. ఎంపీ కాగానే స్పీడ్ బోటు లాగా ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్ గా వెళ్తున్నారని, కానీ ఇప్పుడు చిల్లులు పడిన చెక్క నావలాగా మారారంటూ తెలిపారు. మునిగిపోయే నావలాగా కనిపిస్తున్నారంటు మాట్లాడారు నాని.


అలాగే బందరు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అనే ఆయన చాలా మహిమగల దేవుడు. గతంలో టిడిపి ప్రభుత్వం లో కూడా ఆ స్వామి ఆలయం మీద కన్నేసి, ఆ భూములను కూడా కబ్జా చేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై అమాయకంగా సహకరించిన ఒక పెద్దాయన కూడా అనారోగ్యానికి గురయ్యారని, అయితే కొన్ని కారణాల చేత ఆ ఫైల్ ని ఆపివేశారని తెలిపారు. కేశినేని చిన్ని గారు కూడా ఆ దేవుని ఆస్తులు మీద కన్నెయ్యడంతో ఆయనకి ఈ పరిస్థితి మొదలయ్యిందని తెలిపారు. జగ్గయ్యపేట నందిగామ దగ్గర ఇసుక ఉన్నప్పటికీ కూడా హైదరాబాదుకి తోలలేని పరిస్థితి ఉందని తెలిపారు. దీంతో రూ .11 కోట్లకు పైగా లాస్ అయ్యారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: