మొంథా తుఫాన్ పేరు వినగానే కాకినాడ జిల్లా వాసులను ఒక భయాందోళన కలిగిస్తోంది. ఎవరు ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ హెచ్చరిక కూడా జారీ చేయడంతో దాదాపుగా నాలుగు జిల్లాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల ఇది పెను తుఫానుగా మారుతోంది. మొంథా తుఫాను వల్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా హెచ్చరించారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు, కుండపోత వర్షం వస్తుందంటూ తెలుపుతున్నారు.

అయితే ఈ పరిణామాలు అన్ని చూస్తూ ఉంటే 1996 నాటి ప్రళయాన్ని గుర్తుకు తెస్తోందంటూ కాకినాడ జిల్లా వాసులు భయపడుతున్నారు. యానాం మధ్య తీరం దాటిన ప్రపంచ తుఫాను కోనసీమను సైతం అతలాకుతలం చేసింది. సుమారుగా 215 కిలోమీటర్ల వేగంతో విచిన గాలుల దాటికి సముద్ర తీరంలో అలల వల్ల భారీ ఎత్తున ఎగిసిపడిన ఉప్పెనలతో కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం వంటి మండలాలో విధ్వంసం అయ్యాయి. అలాగే మత్స్యకారుల గ్రామాలను కూడా ధ్వంసం చేసింది. కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయట.


1996 నాటి ప్రళయం వల్ల 1000 మంది పైగా ప్రాణాలు  కోల్పోయారని సుమారుగా 2.25  లక్షల మంది రోడ్డు పాలయ్యారని. 6.47 లక్షల మంది ఇల్లు దెబ్బతిన్నాయి ఇందులో 40 వేల ఇల్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. 6 లక్షల ఎకరాలలో పంట నాశనం అయ్యిందని, 20 లక్షలకు పైగా కొబ్బరి తోటలు పడిపోయాయి. సుమారుగా 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఆనాటి విలయం ఇప్పుడు ఆ ప్రాంత వాసులకు ఇంకా కళ్ళముందే కదలాడుతున్నట్లు కనిపిస్తుంది. అప్పటి ప్రళయం నుంచి కోలుకోవడానికి సుమారుగా ఆ ప్రాంతాలు అన్నీ కూడా పదేళ్లపాటు పట్టింది. మరి ఈసారి ఎలాంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: