పుట్టిన శిశువులను ఎవరికో ఒకరికి అమ్మి చేతులు దులుపుకున్న కథనాలు మరి ఎన్నో చూసాం. కొంత మంది పిల్లల్ని పుట్టాక వారిని పెంచడం కష్టం అనే ఉద్దేశంతో అమ్ముకుంటూ ఉంటే , మరి కొంత మంది ఇంట్లో అప్పటికే ఇద్దరు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నట్లయితే మరో ఆడ పిల్ల జన్మిస్తే ఆమెను కూడా చూసుకోవడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఆడ పిల్లలను అమ్మిన ఉదంతాలు కూడా మనం అనేకం చూసాము ... విన్నాము. ఇకపోతే అలా పిల్లల్ని అమ్ముతున్న వారిలో కొనుక్కునే వారి సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

అందుకు ప్రధాన కారణం గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అంటే దాదాపుగా సెటిల్ అయ్యాక చేసుకుందాం. సెట్టిల్ కానట్లయితే పిల్లలు పుట్టినట్లయితే వారి బాగోగులు చూసుకోవడం కష్టం అవుతుంది అని మగవారు , ఆడవాళ్లు  ఇద్దరు అనుకోవడంతో పెళ్లిళ్లు మునపటితో పోలిస్తే కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి. దానితో ప్రస్తుత కాలుష్య ప్రభావాలు , భోజన ప్రభావాల వల్ల వయస్సు పెరగడంతో చాలా మంది కి పిల్లలు కలగడం లేదు దానితో కొంత మంది హస్పటల్స్ చుట్టూ తిరిగి పిల్లల్ని కంటున్నా కూడా మరి కొంత మంది కి అలా కూడా పిల్లలు కలగడం లేదు. దానితో అలాంటి వారు పిల్లల్ని నేరుగా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో ఈ మధ్య కాలంలో పిల్లల కొనుగోలు వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో కథనం వెలుగులోకి వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... నల్గొండ జిల్లాలో నివాసముంటున్న కొత్త బాబు , పార్వతీ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తాజాగా పార్వతి మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. దానితో ఆమెను పెంచడం కష్టం అవుతుంది అనే ఆలోచనకు వచ్చి తన బంధువుకు కొత్త బాబు ఈ సమాచారాన్ని ఇచ్చాడు.

దానితో ఆయన తూర్పుగోదావరిలో ఉన్న సాంబశివరావుకు ఈ విషయాన్ని చెప్పాడు. దానితో సాంబశివరావు వచ్చి ఆ చిన్న పాపను తీసుకువెళ్లిపోయాడు. ఆ తర్వాత కాన్పు తర్వాత పసి పాప కనిపించకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. దానితో బంధువులు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేశారు. దానితో ఆ పాపను గుంటూరు జిల్లాకు చెందిన వారు ఐదు లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇలా తాజాగా ఆడ పిల్లను అమ్మకం జరిపిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: