నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలుపు ఈజీ అవుతుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు రెండు లక్షల మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక పార్టీ 2000 ఇస్తే మరో పార్టీ మూడు వేలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మూడు పార్టీలు కలిపి ఒక్కో ఓటర్కు దాదాపు 6 నుంచి 7000 వరకు నగదు ముట్ట చెప్పే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే డబ్బులను నియోజకవర్గంలోకి డంప్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా స్లమ్ ఏరియాలో ఉండే ఓటర్ లకు భారీగా నగదు ఇవ్వాలని ఉద్దేశంలో అన్ని పార్టీలు ఉన్నాయి.
పోల్ మేనేజ్మెంట్లో నగదుతో పాటు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. ఒక్కో పార్టీ సగటున 15 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేసి నియోజకవర్గంలో దాచిపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో 47 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కో బూత్ కు ఒక్కో పార్టీ ఒక లీడర్ కు బాధ్యతలు అప్పగించింది. భోజనాలు .. మందు పార్టీలు వీటికోసం ప్రతిరోజు ఒక్కో బూత్ కు 20 వేల వరకు అన్ని పార్టీలకు పంపిణీ చేస్తున్నాయి. అంటే పోలింగ్ ముగిసే వరకు ఒక్కో పోలింగ్ బూత్ కు రెండు లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేవలం భూత్ స్థాయి లీడర్ల ఖర్చుల కోసమే 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి