టిడిపి పార్టీలో సీనియర్ నేతగా చాలామంది నేతలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది నేతలు కీలకంగా వ్యవహరించారు.ఏపీ, తెలంగాణ విడిపోయినప్పటి నుంచి చాలామంది నేతలు టిడిపి పార్టీలో కొనసాగారు. 2024 ఎన్నికలలో మాత్రం చాలామంది సీనియర్ నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. అందులో కొంతమంది తమ వారసులను రంగంలోకి దింపేలా కూడా ప్లాన్ చేసుకున్నారు. టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న నేతలలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. ఇటీవలే విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే.. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడారు అయ్యన్నపాత్రుడు.


వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనంటూ తెలియజేశారు. అయితే తన వారసుడు( విజయ్) పోటీ చేసేందుకు గాను తాను పక్కకు తప్పుకుంటున్నట్లుగా వినిపిస్తున్నాయి. సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు 1983లో టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతూ ఎన్నో పదవులలో కొనసాగారు.. అలా 1985, 89,94,99,2004,2014,2024 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1996 ఎన్నికలలో ఎంపీగా కూడా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. టిడిపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన గొంతు వినిపించేవారు.


కానీ ఈసారి మాత్రం  స్పీకర్ పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు. అయితే ఈసారి రాబోయే(2029) ఎన్నికలలో తన కుమారుడు విజయ్ పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవంగా 2024 ఎన్నికలలోనే విజయ్ పోటీ చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల చేత చంద్రబాబు అయ్యన్నపాత్రుడునే రంగంలోకి దించారట.. అలా 2024 లోవిజయ్ అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇవ్వకూడదని నిబంధన ఉండడంతో వెనక్కి తగ్గేది కూటమి. అందుకే ఈసారి ఎన్నికలలో అయ్యన్నపాత్రుడు దూరం అయ్యి తన కుమారుడు విజయ్ ని పోటీ చేయించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈసారి అయ్యన్నపాత్రుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: