రాజీనామాలు చేస్తున్న తెలుగుదేశంపార్టీ నేతల్లో కొందరిపై కోవర్టులనే ప్రచారం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కొందరు నేతలు బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు  రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ టిడిపి ఓడిపోగానే వెంటనే బిజెపిలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే.

 

వాళ్ళు పార్టీ ఫిరాయించటంలో చంద్రబాబు ప్రోత్సాహం ఉందనే ప్రచారం పార్టీలో ఇప్పటికీ జరుగుతోంది. ఇందులో భాగంగానే కొందరు నేతలు వైసిపిలో చేరారు. ఇపుడీ విషయం మీదే పార్టీలో కోవర్టులనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా జూపూడి ప్రభాకర్ టిడిపికి రాజీనామా చేసి వైసిపిలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దానికన్నా ముందు కడప జిల్లాలో వీరశివారెడ్డి, వైజాగ్ జిల్లాలో విశాఖ డైరీ ఛైర్మన్  అడారి కుటుంబం వైసిపిలో చేరింది.

 

ఇలా వైసిపిలో చేరిన వాళ్ళ విషయంలోనే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూపూడి వ్యవహరమే తీసుకుంటే జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకడుగా ఉండేవాడు. అలాంటిది 2014 ఎన్నికల్లో వైసిపి ఓడిపోగానే టిడిపిలో చేరారు. టిడిపి కండువా కప్పుకున్న తర్వాత నుండి జగన్ ను ఎంతగా విమర్శించారో అందరికీ తెలిసిందే. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోగానే ఇపుడు వైసిపిలో చేరిపోయారు.

 

అంటే తనకు బాగా సన్నిహితులకున్న వాళ్ళల్లో కొందరిని చంద్రబాబు బిజెపిలోకి పంపుతున్నట్లే మరికొందరిని వైసిపిలోకి పంపుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమో ఏమైనా జరగవచ్చు.

 

ఎందుకంటే చంద్రబాబును నమ్మేందుకే లేదు. ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు ఆరితేరిపోయారు. కాబట్టి ప్రత్యర్ధిపార్టీల నుండి తనకు ఎటువంటి సమస్యలు రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్త పడతారనటంటో ఎవరికీ అనుమానాలు లేవు. అందుకనే వైసిపిలో చేరుతున్న వాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలని జగన్ కు నేతలు సూచనలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: