నిజంగా ఎల్లోమీడియా పరిస్ధితి చాలా దారుణంగా తయారైనట్లే ఉంది. గడచిన ఏడాది నుండి ఎల్లోమీడియా ఓ టార్గెట్ పెట్టుకుంది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గబ్బుపట్టించాలని. దానికి అంశంతో సంబంధం లేదు. మంచి చెడులతో సంబంధం లేదు. రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా,  ప్రభుత్వంతో సంబంధం ఉన్నా లేకపోయినా సరే జరిగింది చిన్న ఘటనే కానీవండి వెంటనే దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టేయటం, జగన్ పై బురద చల్లేయటం. నిజంగా టార్గెట్ కంప్లీట్ చేయాలంటే కష్టమే. కానీ ఎల్లోమీడియా నెట్టుకొచ్చేస్తోంది. ఎలా నెట్టుకొచ్చేస్తోంది ? ఎలాగంటే అవుట్ డేటెడ్ నేతలతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలని, జగన్ అంటే ఏమాత్రం పడని అనేకమందిని ఇంటర్వ్యూల పేరుతో గంటల కొద్దీ డిబేట్లు పెట్టేస్తున్నాయి ఎల్లోమీడియా.  దాంతో ప్రతిరోజు జగన్ వ్యతిరేక కార్యక్రమాలతో సమయాన్ని ఏదోలా నెట్టుకొచ్చేస్తున్నాయి. ఏబిఎన్, టివి 5 చానళ్ళు ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏబిఎన్ చానల్ అయితే జగన్ను తిట్టటానికి పర్మినెంటుగా ఓ అవుట్ డేటెడ్ నేత సబ్బం హరితో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లే అనుమానంగా ఉంది.




ఇక్కడ విషయం ఏమిటంటే ఏబిఎన్ చానల్ కే కాదు సబ్బం హరి కూడా జగన్ కామన్ శతృవు. అందుకనే దాదాపు ప్రతిరోజు సబ్బంతో ఏబిఎన్ చానల్ ఇంటర్వ్యూలని, ప్రత్యేక డిబేట్ అని ఏదేదో మాట్లాడించేస్తోంది. ఆయన కూడా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నాడు. ఇంతకీ చానల్ లో సబ్బం చెప్పేదేమిటంటే విశాఖపట్నం వాసులు రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారట. జిల్లాలోని 67 శాతం ప్రజలు జగన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సబ్బం చెప్పటమే విచిత్రంగా ఉంది. సబ్బం చెప్పినదానికి తగ్గట్లుగానే చానల్ కూడా చిడతలు వాయిస్తు ఆనందపడిపోతోంది. రాజధాని అమరావతి నుండి ఇంచు కూడా కదలదని, విశాఖలో రాజధానికి భూమిపూజ జరిగే అవకాశం లేదని ప్రతిరోజు సబ్బం జనాలకు చెప్పిందే చెబుతున్నాడు. రాజధాని అంశంతో తనకు సంబంధం లేదని  కేంద్రం చెప్పటాన్ని కూడా వీళ్ళు తప్పు పడుతున్నారు.




రాజధానిగా అమరావతిని చంద్రబాబునాయుడు ప్రకటించినపుడూ కేంద్రం పట్టంచుకోలేదు. అదే పద్దతిలో రాజధానిని వైజాగ్ కు తరలిస్తామని జగన్ చెప్పినా పట్టించుకోవటం లేదు. అమరావతిని రాజధానిగా చేసుకున్న చంద్రబాబు భ్రమల్లో కాకుండా వాస్తవిక రాజధానిని నిర్మించేసుంటే ఇపుడు జగన్ కు అవకాశం ఉండేదికాదు. చంద్రబాబు ఫెయిల్యూర్ ను కూడా ఎల్లోమీడియా, సబ్బం జగన్ ఖాతాలో వేసేస్తోంది. నిజానికి తమకు రాజధాని వస్తుందంటే ఏ ప్రాంతం వాసులైనా వద్దంటారా ? నిజంగా సబ్బం చెబుతున్న మాటలన్నీ మతిలేని మాటలుగానే చూడాలి. తనింట్లో కూర్చుని టివి చర్చలో పాల్గొంటున్న సబ్బం ఇదే విషయాన్ని విశాఖలో బహిరంగ సభ పెట్టి ఎందుకు చెప్పటం లేదు ?  జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా జనాలంతా ఉన్నారన్న విషయాన్ని బహిరంగంగా రోడ్లపైకి వచ్చి నిరూపించొచ్చుకదా ? ఓ బహిరంగసభ ఏర్పాటు చేసి జనాల నిరసనను ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నాన్ని సబ్బం ఎందుకు చేయటం లేదు ?




వైజాగ్ క్యాపిటల్ గా జగన్ ప్రకటించగానే ఉత్తరాంధ్రవాసులంతా సంతోషం వ్యక్తం చేశారు. జగన్ ప్రకటనకు సానుకూలంగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల టిడిపి కమిటిలు కూడా తీర్మానం చేశాయని ప్రచారం జరుగుతోంది. వైజాగ్ నగరంలో టిడిపి తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  టిడిపి ఎంఎల్ఏలే  రాజధానిగా వైజాగ్ ను స్వాగతిస్తుంటే ఓడిపోయిన, అవుట్ డేటెడ్ నేత సబ్బం మాత్రం జిల్లా ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని ప్రతిరోజు చెప్పిందే చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. జనబలం లేని వాళ్ళని, అవుట్ డేటెడ్ నేతలను పట్టుకుని ఎల్లోమీడియా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తు తెగ సంతోషపడిపోతోంది. తన ఆలోచనే యావత్ జిల్లా ప్రజల ఆలోచనగా సబ్బం టివి చర్చల్లో చెప్పేస్తున్నాడు. తాను వేరు జనాలు వేరన్న కనీస స్పృహ కూడా సబ్బంలో కొరవడింది.  జరుగుతున్నది చూస్తుంటే ఇటువంటి అవుట్ డేటెడ్ నేతలు తప్ప ఎల్లోమీడియాకు దిక్కు లేదన్న విషయం తెలిసిపోతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: