నిజంగా విచిత్రంగానే ఉంది ఈ విషయం. నిన్నటి వరకు పార్టీలోనే ఉన్న తమ్ముడు బయటకు రాగానే ఏకంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే ఛాలెంజ్  చేయటం విడ్డూరంగానే ఉంది. నిన్నగాక మొన్న టిడిపి నుండి వైసిపిలో చేరిన విశాఖపట్నం ఎంఎల్ఏ  వాసుపల్లి గణేష్ కుమార్ ఉపఎన్నికల విషయంలో చంద్రబాబునే చాలెంజ్ చేయటం సంచలనంగా మారింది. మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి చేసినప్పటి నుండి చంద్రబాబు+ఎల్లో బ్యాచ్ రెచ్చిపోతున్నారు. అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలంటూ చంద్రబాబు+ఎల్లోబ్యాచ్ చేస్తున్న గోలను అందరు చూస్తున్నదే.




చంద్రబాబు గోలను పక్కనపెట్టేస్తే తాజాగా ఇదే విషయమై టిడిపి ఎంఎల్ఏ వాసుపల్లి టిడిపికి రాజీనామా చేశాడు. దాంతో రెచ్చిపోయిన చంద్రబాబు పార్టీమారిన ఎంఎల్ఏపై నోటికొచ్చినట్లు మాట్లడాడు. దాంతో వాసుపల్లి కూడా రివర్సులో రెచ్చిపోయాడు. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయకుండానే  పార్టీ మారిన తనపై దమ్ముంటే చంద్రబాబు ఫిర్యాదు చేయాలంటూ సవాలు విసరటమే విచిత్రంగా ఉంది. తనపై స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వాలంటూ చంద్రబాబుపై తొడగొట్టాడు. తనపై అనర్హత వేటు వేయించి ఉపఎన్నికలు జరిపించాలని కోరటమే ఆశ్చర్యంగా ఉంది.




తన నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరిగితే తనపై టిడిపి అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోవాలంటూ సవాలు విసరటమే అసలైన ట్విస్టు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంఎల్ఏ చాలెంజ్ కు పార్టీ నుండి ఎవరు సమాధానమే చెప్పటంలేదు. నిజంగానే వైజాగ్ ని రాజధానిగా అక్కడి వాళ్ళు ఎవరు కోరుకోవటం లేదని చంద్రబాబు చెబుతున్నదే నిజమైతే ఎంఎల్ఏ చాలెంజిని స్వీకరించచ్చు కదా. వెంటనే స్పీకర్ ను కలిసి వాసుపల్లి పై అనర్హత పిటిషన్ ఇచ్చేస్తే ఓ పనైపోతుంది. అర్జంటుగా ఉపఎన్నికలు పెట్టించేసి టిడిపి అభ్యర్ధిని పోటిలోకి దింపేసి గెలిపించేసుకుంటే సరిపోతుంది.




నిజంగా టిడిపి అభ్యర్ధినే గెలిపించుకుంటే రాజధానిగా అమరావతే ఉండాలనే  చంద్రబాబు వాదనకు కూడా మద్దతు పెరుగుతుందేమో.  ప్రస్తుతం వైజాగ్ లో ఉపఎన్నికంటూ జరిగితే కచ్చితంగా అది రాజధానిపై రెఫరెండంగానే  జనాలు కూడా భావిస్తారు. ఉపఎన్నికంటూ రావాలే కానీ చంద్రబాబుతో పాటు టిడిపిలోని ఉద్దండ నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ, సబ్బంహరి, గంటా శ్రీనివాసరావు లాంటి అనేకమంది రంగంలోకి దిగేయరా ? కమాన్ చంద్రబాబు ఇంకా ఎందుకాలస్యం అనర్హత పిటీషన్ వేసేసి ఉపఎన్నిక జరిపించే పనిమీదుండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: