తెల్ల‌వారి దాస్య‌శృంఖ‌లాల మ‌ధ్య చిక్కుకున్న భ‌ర‌త‌మాత బానిస‌త్వాన్ని తెగ్గొట్టాల‌ని నిశ్చ‌యించుకున్నారు. నెత్తురు స‌ల‌స‌ల కాగింది. స్వాతంత్ర్యం కోసం పోరాడే వీరుల‌ను అణ‌చివేయ‌డానికి తెచ్చిన కొత్త చ‌ట్టం ఆమోదం పొంద‌కుండా ఉండాల‌న్న ఉద్దేశంతో పాల‌కులు స‌మావేశ‌మైన శాస‌న‌స‌భ‌లోనే బాంబుదాడికి పాల్ప‌డ్డారు. అక్క‌డ కూడా త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు ఆ వీరులు. ఎవ‌రికీ ప్రాణాపాయం క‌ల‌గ‌నిరీతిలో, ఎటువంటి హాని జ‌ర‌గ‌కుండా కేవ‌లం త‌మ అభిప్రాయాల‌ను చాటాల‌నే ఉద్దేశంతో జ‌రిగిన బాంబు దాడి అది. అయినా బ్రిటీష్ ప్ర‌భుత్వానికి అవేమీ ప‌ట్ట‌లేదు. లొంగిపోయిన ఆ వీరుల‌ను ఉరి తీసింది. భ‌ర‌త‌మాత‌చేత క‌న్నీరు పెట్టించింది.

ముక్క‌లు ముక్క‌లుగా శ‌రీరాలు
రేపు ఉదయం వారిని ఉరి తీయనున్నారు అనే మాట వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఏ క్షణమైనా క్షమాభిక్ష పెట్టకపోతారా అని భగత్ సింగ్ సోదరుడు మరియు అత‌ని తండ్రి జైలు వద్దే మార్చి 23వ తేదీ సాయంత్రం నుంచి వేచి చూస్తున్నారు. ఈలోపు జైలు సిబ్బంది, వ్యాన్లోకి మూడు సంచులను మోసుకెళ్లి పడేయటం చూశారు. ఇంటికి వెళ్లి ఒకసారి కుటుంబాన్ని కలిసి మళ్ళీ వద్దామని పెద్ద కొడుకు చెప్పడంతో ఆ తండ్రి అక్కడనుంచి కదిలాడు. తెల్లవారు జామున జైలు వద్దకు చేరుకున్న వారికి జైలు సిబ్బంది చెప్పిన మాటలు విని గుండెలు ప‌గిలిపోయాయి. నిన్న సాయంత్రమే వారిని ఉరి తీశారు.. ఊరు చివర ఖననం చేశారు చూడండి.. అని చెప్పడంతో పరుగు పరుగున వెళ్లారు. అప్ప‌టికే సగం కాలిన శరీరాలు ముక్కలు ముక్కలు గా కనిపించాయి.

నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌రీ..
సూర్యాస్తమయంలో ఉరి తీయకూడదు అన్న నిబంధనను కూడా పక్కన బెట్టి ఆ వీరులను ఉరి తీశారు. అయినా వీరి మీద ఉన్న కోపం, కసి తీరని తెల్ల‌దొర‌లు ముక్కలు ముక్కలుగా కోశారు. ఈ మృత‌దేహాలు చూస్తే ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ విప్ల‌వం త‌లెత్త‌కూడ‌దు అన్న ఉద్దేశంతో ఎవ‌రికీ తెలియ‌కుండా స‌ట్లెజ్ న‌దీతీరంలోని హుస్సేన్‌వాలా అనే ఊరిలో వీటిని ద‌హ‌నం చేశారు. దీన్నిబ‌ట్టి వీరిని ఏ స్థాయిలో ముప్పుతిప్పలు పెట్టారో అర్థం కావ‌డంలేదూ! దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహనీయులకు బ్రిటిష్ వాడు ఇచ్చిన గౌరవం అది. ఆ స్వాతంత్ర్య వీరుల‌ను ర‌క్షించే అవ‌కాశం కూడా దేశంలో ఎవ‌రికీ లేక‌పోయింది. సుఖ్ దేవ్, భగత్ సింగ్, రాజ్‌గురుకు నివాళి అర్పిస్తూ...

మరింత సమాచారం తెలుసుకోండి: