ఆస్ట్రేలియా ఆల్ రౌండర్  షేన్ వాట్సన్  అంతర్జాతీయ క్రికెట్  కు గుడ్ బై చెప్పబోతున్నాడు.  ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న T20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ఆడే లాస్ట్  మ్యాచ్ .. వాట్సన్ కు ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుందట. 2002లో సరిగ్గా మార్చి 24న  దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో షేన్ కెరీర్ ప్రారంభించాడు.

గతేడాది యాషెస్ సిరీస్ తరువాత టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన వాట్సన్ .. లాస్ట్ సెప్టెంబర్  తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. ప్రస్తుతం అసీస్  జట్టులో 2007 కంటే ముందు కంగారు జట్టుకు అడిన ఒకే ఒక సభ్యుడైన వాట్సన్ .... 2007, 2015 ప్రపంచకప్  గెలిచిన కంగారూల జట్టులో సభ్యుడు. ఇప్పటి వరకు జరిగిన 6 టీ ట్వంటీ వరల్డ్ కప్ ల్లోనూ ఆడాడు. ఆస్ట్రేలియాకు ఆడడాన్ని గర్వకారణంగా చెప్పిన వాట్సన్ .. రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం అంటున్నాడు.

ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందంటున్నాు వాట్సన్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి తరచు గాయాల బారిన పడటం కూడా ఒక కారణమని వాట్సన్ పేర్కొన్నాడు.

వాట్సన్ కేరీర్ ను ఓసారి పరిశీలిస్తే....వాట్సన్.. 59 టెస్టు మ్యాచ్ లు, 190 వన్డేలు ఆడాడు.  56 ట్వంటీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు.  

టెస్టుల్లో...

4 సెంచరీలు
యావరేజ్ 35 పరుగులు.
అత్యధిక స్కోరు 176.
బౌలర్ గా  75 వికెట్లు

వన్డేల్లో

9 సెంచరీలు , 33 హాఫ్ సెంచరీలు
మొత్తం 5,757 పరుగులు
168 వికెట్లు
అత్యధిక స్కోరు 185 నాటౌట్

ట్వంటీ 20 ల్లో...

ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు
46 వికెట్లు తీశాడు.
అత్యధిక స్కోరు 124 నాటౌట్. 



మరింత సమాచారం తెలుసుకోండి: