పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతున్నప్పుడు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ వింత సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2020 లోఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినాయి కానీ ఇప్పుడు మనం చెప్పబోయే సంఘటన నమ్మ లేనటువంటి స్థాయిలో ఉంటుంది. వివరాలు తెలుసుకుంటే లాహోర్ కాలండర్స్, పెషావర్ జాల్మి మధ్య 12 ఓవర్ల మ్యాచ్ జరిగింది. వాస్తవానికి ఈ రెండిటి మధ్య మ్యాచ్ జరిగే ముందు వర్షం వచ్చింది అందువలన ఈ మ్యాచ్ని 20 నుంచి 12 ఓవర్ల వరకు కుదించారు.

 


మొదటిగా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన పెషావర్ జాల్మి టీమ్ ఓపెనర్ టామ్ బెంటోన్, కమ్రాన్ అక్మల్ లతో 32 రన్స్ చేయగా... నెక్స్ట్ బంతిని ఆఫ్రిది విసరగా కమ్రాన్ అక్మల్ బౌండరీ దాటించడానికి ప్రయత్నించి అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత హైదర్ ఆలీ దిగి 12 బాల్లలో 32 పరుగులు తీస్తాడు. నాలుగు ఫోర్లు ఒక సిక్సు కొట్టి లాహోర్ కాలండర్స్ కి చమట పట్టిస్తాడు హైదర్ అలీ. టామ్ బెంటోన్ కూడా 15 బాల్స్ లో 34 రన్స్ చేశాడు. వీళ్లిద్దరూ కలిసి 12 ఓవర్లలో 132 రన్స్ టీమ్ కి సంపాదించి పెట్టారు. 

 


ఈ క్రమంలోనే ఒక అరుదైన ఫన్నీ ఇన్సిడెంట్ జరిగి అందరి క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అదేంటంటే క్రిస్ లిన్ తల నుండి పొగలు రావడం. తలనుంచి పొగలు రావడం అనేది చాలా తక్కువ మంది చూసి ఉంటారు. సినిమాల్లో అటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి కానీ నిజజీవితంలో ఒక మనిషి తల నుండి పొగ రావటమనేది చెప్పుకోదగ్గ విషయమే. క్రిస్ తలనుండి పోగలు వచ్చే సమయంలో అతడు ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆపోజిట్ టీం సిక్సలు, ఫోర్లు కొడుతుంటే క్రిస్ బౌలర్ల పర్ఫామెన్స్ పై మండిపడుతున్నాడు. అలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రిస్ తలనుండి పొగలు వచ్చే సరికి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి మరీ నవ్వుకుంటున్నారు. ఏదేమైనా తరువాత బాటింగ్ చేసిన లాహోర్ కాలండర్స్ కేవలం 116 రన్స్ మాత్రమే చేసి పరాజయం పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: