సెప్టెంబర్ 19 నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. ప్రతి సీజన్ లో  టైటిల్ ఫేవరెట్ జట్టుగా ముంబై ఇండియన్స్ జట్టు రంగంలోకి దిగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా  ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ప్రతి సీజన్ లో  కూడా అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది. ఇక ఈ సారి కూడా యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ లో  టైటిల్  గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యింది ముంబై ఇండియన్స్ జట్టు. ఇదిలా ఉంటే ముంబై జట్టుకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తోంది.



 భారత దిగ్గజ క్రికెటర్... ముంబై ఇండియన్స్ జట్టు మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టులో కి ఫ్రాంచైజీ తీసుకోబోతుందా అనే టాక్  ప్రస్తుతం మొదలైంది. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదండోయ్... సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం యూఏఈ చేరుకొని క్వారంటైన్ పూర్తి చేసి ముంబై ఆటగాళ్లతో నెట్ ప్రాక్టిస్ చేస్తున్నాడట. ఇటీవలే ముంబై జట్టు ఆటగాళ్లతో స్విమ్మింగ్ పూల్ లో అర్జున్ టెండూల్కర్ స్విమ్మింగ్ చేస్తున్న ఓ  ఫోటో వెలుగులోకి రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తుంది. దీంతో నిజంగానే సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టులోకి రాబోతున్నాడా  అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.




 అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తే గానీ అందరికీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని జట్లు... తమతో పాటు నెట్స్ బౌలర్లను కూడా కొంత మందిని తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే... నెట్స్  బౌలింగ్ చేసేందుకు అర్జున్ టెండూల్కర్ ను కూడా ముంబై టీం తీసుకెళ్లినట్లు మరోవైపు టాక్ వినిపిస్తోంది. మరి ఏది నిజం అన్నది మాత్రం అభిమానులను అయోమయంలో పడేస్తుంది. దీనిపై ప్రాంచైజీ స్పందించి అధికారికంగా వెల్లడి స్తే గాని  అభిమానులు అయోమయం తీరిపోదు.

మరింత సమాచారం తెలుసుకోండి: