2021 సంవత్సరం కు గాను ఐ‌పి‌ఎల్ 14 సీజన్ కు సంబంధించి మినీ వేలం 18 వ తేదీ న నిర్వహించారు. ఈ  మినీ వేలంలో ఫ్రాంచైజీల మద్య  రసవత్తరమైన పోరు సాగింది. ఆటగాళ్లను కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈసారి వేలంలో కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొందరు ఊహించినట్లుగా భారీ ధర పలకగా, మరికొందరు రికార్డు ధరతో అందరికీ షాకిచ్చారు. ఈసారి ఐపీఎల్‌ వేలం ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచారు.

అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా భారీ ధర పలికింది. ఈ సారి ఫ్రాంచైజీలు ఆటగాళ్ల వ్యక్తి గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని ఆయా ఆటగాళ్లపై భారీ ధర పలికారు. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్‌ మోరిస్‌ ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ చరిత్రలోనే‌ రికార్డు సృష్టించాడు. గత సీజన్ లో బెంగుళూరు తరుపున ఆడిన మోరిస్ ఆ జట్టు వదులుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు. కాగా.. రూ.75లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన మోరిస్‌ను రాజస్థాన్‌ జట్టు ఏకంగా రూ.16.25కోట్లతో దక్కించుకుంది.

ఇదిలా ఉండగా టీమిండియా క్రికెట్ చరిత్రలోనే సచిన్ టెండూల్కర్ యొక్క ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది..మాస్టర్ బ్లాస్టర్ గా సచిన్ భారత జట్టుకు ఎన్నో అపూర్వ విజయాలు అంధించదనే కాకుండా ఎన్నో చెరిగిపోని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతటి దిగ్గజ ఆటగాడి తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాది ఐ‌పి‌ఎల్ కు ఆరంగేట్రం చేస్తున్నాడు. తొలిసారి వేలంలో పేరు నమోదు చేసుకున్న అతడిని ముంబయి ఇండియన్స్‌ రూ.20 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. అతడిని సొంతం చేసుకొనేందుకు మరే ఇతర ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు.వేలంలో అర్జున్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని భావించినా అలాంటిదేమీ జరగలేదు. అయితే ఆఖరి పేరు మాత్రం అతడిదే కావడం గమనార్హం.   .

మరింత సమాచారం తెలుసుకోండి: