1896 లో మొట్ట‌మొద‌ల ఒలంపిక్ గేమ్స్ ను ఏథెన్స్ గ్రీస్ లో ప్రారంభించారు. ఆ త‌ర‌వాత ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి ఈ గేమ్స్ ను నిర్వ‌హిస్తున్నారు. ఇక 2021 ఒలంపిక్ గేమ్స్ మరో నాలుగు రోజుల్లో టోక్యో లో ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఒలంపిక్ గేమ్స్ కోసం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. దాంతో క్రీడాకారులు అంతాఒలంపిక్స్ జరిగే గ్రామానికి చేరుకుంటున్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో త‌గిన నిభంధ‌న‌లు పాటిస్తూ ఈ గేమ్స్ ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఇదిలా ఉండగా ఒలంపిక్స్ లోగోలో 5 రింగులు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. 

అయితే ఈ లోగో లో ఐదు రింగుల‌కు ఎంతో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఒలంపిక్స్ లోగోలో ఐదు రంగులను ఎంతో అర్థవంతంగా రూపొందించారు. ఈ ఇంటర్ లాకింగ్ రింగులను 1912లో బారన్ పియరీ డి కోబెర్టిన్ రూపొందించారు.ఇందులోని ప్రతి ఒక్క రింగు ఒక్కో ఖండాన్ని  సూచిస్తుంది. అంటే ఐదు రింగులు ఐదు ఖండాల‌ను సూచిస్తాయి. అవి ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా మరియు యూర‌ఫ్ ఖండాల ను సూచిస్తుంది. సాధార‌ణంగా మ‌నకు ఏడు ఖండాలు ఉంటాయి కానీ నార్త్ అమెరికా సౌత్ అమెరికా క‌లిపి ఒకే రింగును సూచిస్తుంది.

ఇక అంటార్కిటికా అనేది ఉండ‌దు కాబ‌ట్టి దానికి కూడా రింగ్ ఉండ‌దు. అంతేకాకుండా ఈ రింగుల‌కు ఉండే రంగులు కూడా ఒక్కో ఖండాన్ని సూచిస్తాయి. ఇందులో గ్రీన్ అనేది ఆస్ట్రేలియాను సూచిస్తుంది. ఎల్లో క‌ల‌ర్ అనేది ఆసియాను సూచిస్తుంది. అంతే కాకుండా ఎరుపు ఉంగు అనేది అమెరికాను సూచిస్తుంది. న‌లుపు రంగు ఆఫ్రికాను సూచిస్తుంది. మ‌రోవైపు బ్లూ క‌ల‌ర్ అనేది యూర‌ప్ ఖండాన్ని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ రింగుల లోగో డిజైన్ అన్ని దేశాల‌ను ప్రతిబింబించేలా అద్భుతంగా ఉంది. ఇక ఈ లోగోలోని రింగులు వృత్తాకారంలో ఉండి ఓ మంచుపై తేలుతున్న‌ట్టు క‌నిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: