టీ 20 వరల్డ్ కప్ టీమ్ లో సీనియర్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కడం పై పలువురిని ఆశ్చర్యపరిచింది. అశ్విన్ తొలిసారిగా 2017లో టీ20మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టెస్టులకే పరిమితం అయ్యాడు. అయితే ఐపీఎల్ లో మంచి ఆట తీరు కనబరుస్తుండటం వల్లే అతడికి చోటు ఇచ్చినట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చెప్పారు. యూఏఈలో ఆఫ్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని.. వాషింగ్టన్ సుందర్ కు గాయం కావడంతో అశ్విన్ ను తీసుకున్నామని తెలిపారు.

సర్ ప్రైజింగ్ గా టీ20  వరల్డ్ కప్ జట్టులోకి తనను తీసుకోవడంపై అశ్విన్ స్పందించాడు. 2017లో చివరి టీ20 మ్యాచ్ ఆడిన వెటరన్ స్పిన్నర్.. జట్టుకు దూరమయ్యాక తన ఇంట్లో గోడపై ప్రతి సొరంగం చివర్లో కాంతి ఉంటుంది.. సొరంగంలో ఉండి ఆ వెలుగును నమ్మి.. వేచి చూసినవారికే అది కనిపిస్తుందని అని రాసుకున్నాడు. తాను నమ్మిన నినాదం తన జీవితంలో ఇదే నిజమైందని.. సంతోషం కృతజ్ఞత మత్రమే ఇప్పుడు తనను నిర్వచిస్తాయని చెప్పాడు.

టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కల నెరవేరింది.. చాలా గర్వంగా .. ఎమోషనల్ గా ఉందన్నాడు. తనకోసం త్యాగాలు చేసి..తన వెన్నంటి ఉండి ఇన్నాళ్లుగా ప్రేమ.. సపోర్ట్ అందించిన కోచ్ లకు.. ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాడు. ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన మనసు ఉప్పొంగుతోంది అని సూర్య కుమార్ తెలియజేశాడు.

టీ 20 ప్రపంచ కప్ కు ఎంపికైన భారత జట్టులో ఏకంగా ఆరుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు చోటు సంపాదించారు. బ్యాట్స్ మెన్ కోటాలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, బౌలర్ గా రాహుల్ చాహల్, బుమ్రా ఎంపికయ్యారు. ఇందులో రోహిత్, హార్దిక్, బుమ్రా తప్ప మిగిలిన ముగ్గురు 10అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదు. వీరు 2,3 ఏళ్లుగా ఐపీఎల్ లో అదరగొడుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: