నేటి తరానికి భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ లుగా ఉన్నది ఎవరు అంటే మొదటగా వినిపించేది మహేంద్ర సింగ్ ధోనీ పేరు.  ఆ తర్వాత ప్రస్తుతం టీమిండియా లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేరు.  ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ఎనలేని సేవలందించి అందని ద్రాక్షల ఉన్న ప్రపంచకప్ను గెలిపించాడు మహేంద్రసింగ్ ధోని.  క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక ఇప్పుడు భారత జట్టులోకి పరుగుల యంత్రం గా టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు కోహ్లీ.  అదే సమయంలో దిగ్గజ ఆటగాడి గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ .



 ఇలా క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు గా కొనసాగుతున్న వీరి వికెట్ పడగొట్టాలి అని ప్రతి బౌలర్ ఆశ పడుతూ ఉంటాడు. కానీ అది అంత సులభమైన విషయం కాదు కదా.  అందుకే ఇక ఒకవేళ వీరికి బౌలింగ్ చేసే ఛాన్స్ వస్తే ఎన్నో వైవిధ్యమైన బంతులు సందిస్తూ ఇబ్బంది పెట్టి టికెట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.  అయితే కొంత మంది మాత్రం ముగ్గురు క్రికెటర్ల వికెట్లు తీయడంలో విఫలం అయితే కొంత మంది మాత్రం వరుసగా వికెట్లు తీసి సరికొత్త రికార్డు నెలకొల్పారు.  అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు క్రికెటర్లను ఐపీఎల్ లో మూడు జట్లకు కెప్టెన్ లుగా కొనసాగుతున్నారు.



 అయితే ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్ లు కూడా ఓకే బౌలర్ చేతిలో ఏకంగా ఎక్కువసార్లు అవుట్ కావడం గమనార్హం. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ సునీల్ నరైన్ బౌలింగ్లో ఏకంగా ఏడుసార్లు అవుటయ్యాడు. ఇక ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ  జహీర్ ఖాన్ బౌలింగులో ఏకంగా ఏడుసార్లు వికెట్ కోల్పోయాడు.  ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా పరుగుల యంత్రంగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ సందీప్ శర్మ బౌలింగ్లో 7 సార్లు వికెట్ కోల్పోవడం గమనార్హం.  ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా ఓకే బౌలర్ చేతిలో ఏడుసార్లు వికెట్ కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl