నిన్నటి నుండి ఘనంగా టీ 20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం జరిగిన మొదటి మ్యాచ్ లో ఆతిథ్య ఒమన్ న్యు గినియా ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ లో మొత్తం ఒమన్ ఆధిపత్యమే కనిపించింది. దీనితో గ్రూప్ బి లో ఉన్న మిగిలిన జట్లకు తమ విజయంతో చెమటలు పట్టేలా చేసింది ఒమన్. గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి లో మొత్తం కలిపి ఎనిమిది జట్ల నుండి నాలుగు జట్లు సూపర్ 12 లో అర్హత సాధించడానికి పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న గ్రూప్ బి నుండి మ్యాచ్ జరిగింది. ఇందులో ఒమన్, న్యూ గినియా, స్కాట్లాండ్ మరియు బంగ్లాదేశ్ లు ఉన్నాయి. అందులో తామాడిన మొదటి మ్యాచ్ లోనే ఘన విజయం సాధించి సూపర్ 12 కు చేరువ కావడానికి తొలి అడుగు వేసింది.

కాగా నిన్న జరిగిన ఇంకో మ్యాచ్ లో స్కాట్లాండ్ మరియు బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ ఓటమి పేలాయి సూపర్ 12 అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ నాలుగు జట్లలో గ్రూప్ బి నుండి ఏ రెండు జట్లు సూపర్ 12 కు అర్హత సాదిస్తాయో అని క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో స్కాట్లాండ్ మరియు ఒమన్ లు సూపర్ 12 కు అర్హత సాధిస్తాయి అని తెలుస్తోంది.  న్యూ గినియా ను సైతం తక్కువ అంచనా వేయలేం. కానీ మొదటి మ్యాచ్ లోనే ఘోరపరాజయం పాలవ్వడంతో మిగిలిన రెండు మ్యాచ్ లు గెలవాలి మరియు ఎక్కువ రన్ రేట్ ను సాధించాలి.

కానీ ప్రస్తుతం జరిగిన రెండు మ్యాచ్ లను బట్టి గ్రూప్ బి నుండి స్కాట్లాండ్ మరియు బంగ్లాదేశ్ లు అర్హత సాదిస్తాయి. ఇక గ్రూప్ ఏ నుండి ఈ రోజు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ గ్రూప్ లో ఐర్లాండ్, నెదర్లాండ్, శ్రీలంక మరియు నమీబియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుండి శ్రీలంక మరియు ఐర్లాండ్ జట్లు సూపర్ 12 కు అర్హత సాధిస్తాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి నెదర్లాండ్ మరియు నమీబియా జట్ల సామర్థ్యాలకు తక్కువ కాదు. మరి ఏమి జరగనుంది...రెండు గ్రూప్ ల నుండి మెయిన్ 12 కు అర్హత సాధించే ఆ నాలుగు టీమ్ లు ఏవి అనేది తెలియాలంటే ఇంకో అయిదు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: