అసలు టీమిండియాకు ఏమైంది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జట్టు గా కొనసాగుతున్న టీమిండియా గత కొంత కాలం నుంచి మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటివరకు కెప్టెన్సీ వివాదం కారణంగా టీమిండియా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు వరుస ఓటముల కారణంగా వార్తల్లో నిలిచింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం అవడంతో ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలను యువ ఆటగాడు కేఎల్ రాహుల్ కు అప్పగించింది బీసీసీఐ. అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా మాత్రం సమర్థవంతంగా రాణించడం లేదు అని చెప్పాలి. గతంలో టెస్టు సిరీస్లో కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా ఓటమి చవిచూసింది.


 ఇటీవలే వన్డే సిరీస్లో కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా మరో సారి వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరిస్ చేజార్చుకుంది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. అయితే జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయి అంటూ ఎంతో మంది క్రికెటర్లు ప్రేక్షకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న ఎంతోమంది యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ లో అద్భుతంగా రాణించి వరుస సెంచరీల తో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్ లను టీమిండియాలో అవకాశం కల్పించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.


 ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న కె.ఎల్.రాహుల్ రుతురాజ్ కు అవకాశం ఇవ్వకపోవడం కేవలం బెంచ్ కే పరిమితం చేయడం అతను చేస్తున్న పెద్ద తప్పు  అంటూ కామెంట్ చేస్తున్నారు. అతనిలో ఉన్న ప్రతిభను ఉపయోగించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆల్రౌండర్గా ఉండ వెంకటేష్ అయ్యర్  నూ జట్టు నుంచి పక్కకు పెట్టి రుతురాజ్ గైక్వాడ్ కి అవకాశం ఇస్తే టీమిండియాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ఐపీఎల్ లో టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నా రుతురాజ్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ లో కూడా సెంచరీలతో చెలరేగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: