ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా నిరాశపర్చిన టీమిండియా ఇప్పుడు వెస్టిండీస్ తో స్వదేశంలో జరగబోయే వన్డే టి20 సిరీస్ లలో మాత్రం సత్తా చాటేందుకు సిద్ధమైంది అనే చెప్పాలి. అయితే మొన్నటి వరకు గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ  మళ్లీ కెప్టెన్గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇక స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే టి20 జట్లను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. ఇకపోతే వన్డే జట్టును ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ కు కొత్త తలనొప్పి మొదలైంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా జట్టులో కేవలం ఇద్దరు ఓపెనర్లను మాత్రమే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల ప్రకటించిన వన్డే జట్టులో మాత్రం నలుగురు ఓపెనర్లు ఉండటం గమనార్హం.



 ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, కె.ఎల్.రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా ఉన్నారు. అయితే ఇటీవలే సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో శిఖర్ ధావన్ కె.ఎల్.రాహుల్ టీమిండియాకు ఓపెనింగ్ చేశారు. ఫుల్ ఫాంలో కొనసాగుతున్న యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ను బెంచ్ కే పరిమితం చేసారు. అయితే ఇటీవల కాలంలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్లో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో 603 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం గమనార్హం.



 దీంతో మొన్న దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బెంజ్ కే పరిమితం చేసిన రుతురాజ్ గైక్వాడ్ ను ఇక  వెస్టిండీస్తో జరగబోయే వన్డే సిరీస్లో మాత్రం తుది జట్టులో అవకాశం కల్పించాలి అంటూ డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇక జట్టులో నలుగురు ఓపెనర్లు ఉండటం అటు కెప్టెన్ రోహిత్ శర్మకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది అని తెలుస్తోంది. అటు మరోవైపు శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ కూడా వెస్టిండీస్ పర్యటనలో బాగా రాణించారు. దీంతో వారిని పక్కన పెట్టలేని పరిస్థితి. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనర్ స్థానాన్ని కూడా త్యాగం చేయలేని పరిస్థితి. రుతురాజ్ గైక్వాడ్  ను బెంచ్ కే పరిమితం చేస్తే విమర్శలు వస్తాయ్. దీంతో జట్టులో నలుగురు ఓపెనర్లు ఉండగా రోహిత్ శర్మ ఏం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: