అద్భుతమైన టాలెంట్ అతని సొంతం.. ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నాడంటే చాలు సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఉంటాడు. బంతి ఎలా వచ్చినా సరే దానిని బౌండరీకి తరలించడమె లక్ష్యంగా పెట్టుకున్నాడు. అద్భుతమైన టెక్నిక్ తో కూడిన షాట్లు ఆడటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నోసార్లు ఒంటిచేత్తో మ్యాచ్ విజయాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఆటగాడు ఎవరో కాదు సంజూ శాంసన్. అయితే సంజు శాంసన్ గొప్ప ఆటగాడు కానీ అతని మెరుపులు పరుగులు అన్ని కూడా కేవలం ఐపీఎల్ కి మాత్రమే పరిమితం అయ్యాయి. టీమిండియాలో చోటు దక్కించుకున్న అప్పుడల్లా పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉన్నాడు.


 ఇక నిలకడ లేని కారణంగా టీమిండియాకు సంజు శాంసన్ పూర్తిగా దూరం అయిపోయాడు. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ గాయపడటంతో అనూహ్యంగా  చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ మళ్ళీ టీమిండియా లోకి పునరాగమనం చేశాడు.  ఇక ఇటీవలే సంజీవ్ సాంసంగ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 సంజూ శాంసన్ లో అసమాన ప్రతిభ ఉంది.  అతని బ్యాటింగ్ చూసినప్పుడల్లా ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే ఇలా అతనిలో ఉన్న ప్రతిభకు కొదవలేదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. భారత్లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వాటిని మైదానంలో చూపించడం ఎంతో ముఖ్యమైన విషయం. ఇక సంజు శాంసన్  లో అన్ని రకాల షాట్లు ఆడగల సామర్థ్యం దాగివుంది. అతను ఆడే షాట్లు మిగతా బ్యాట్స్మెన్ లకు మాత్రం ఆడటం ఎంతో కష్టమే. అతనిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి అతని సరైన రీతిలో వాడుకుంటాం.. ఇక సంజు శాంసన్ అతనికి ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటాడు  అని ఆశిస్తున్నాము.. అతనిపై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: