ఐపిఎల్ 15 వ సీజన్ లో టైటిల్ కోసం పోటీ పడుతున్న జట్లు 10 కి చేరాయి. దీనితో క్రికెట్ ప్రేమికుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంతకు ముందు వరకు 8 జట్లు మాత్రమే ఐపిఎల్ లో ఉండేవి. కానీ ఈ సంవత్సరం 2 కొత్త జట్లు వచ్చి చేరాయి. అందులో ఒకటి లక్నో సూపర్ జైంట్స్ కాగా మరొకటి గుజరాత్ టైటాన్స్. ఈ సారి టైటిల్ గెలిచే సత్తా ఉన్న జట్లలో ఈ రెండు కూడా ఉన్నాయి. కాగా ఐపిఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాగైనా ఈ సారి టైటిల్ ను గెలవడానికి చాలా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.

అందులో భాగంగా ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో బెంగళూర్ లో జరిగిన ఐపిఎల్ మెగా వేలంలో కీలక ప్లేయర్స్ ను దక్కించుకుంది. కాగా ఇప్పుడు మరో స్టెప్ తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ను అసిస్టెంట్ కోచ్ గా తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ది అని తెలుస్తోంది. షేన్ వాట్సన్ కు ఐపిఎల్ లో సుదీర్ఘ అనుభవం ఉంది. పైగా ఐపిఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అందుకే వాట్సన్ కి ఉన్న ఐపిఎల్ అనుభవాన్ని క్యాష్ చేసుకోవాలని ఢిల్లీ ప్లాన్.

షేన్ వాట్సన్ తో ఇప్పటికే చర్చించి నిర్ణయం తీసుకుందట. ఇక అధికారిక సమాచారం రావడమే తరువాయి. మరి చూద్దాం అసిస్టెంట్ కోచ్ గా రాబోతున్న షేన్ వాట్సన్ ఢిల్లీ కి ఐపిఎల్ టైటిల్ అందించగలడా? మరో వైపు టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కు అసిస్టెంట్ కోచ్ గా తీసుకున్నారు. ఈ విషయాన్నీ ఇప్పటికే అధికారికంగా ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: