బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్థానం ఎంత విజయవంతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగతా ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ లో రికార్డులు సృష్టించింది ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. సీనియర్ ఆటగాళ్లతో డాడీస్ ఆర్మీ అనే పేరు తెచ్చుకున్నప్పటికీ వరుసగా టైటిల్ గెలుస్తూ దూసుకుపోయింది. ఇప్పటివరకు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేత గా నిలిచి తిరుగులేదు అని నిరూపించుకుంది చెన్నై సూపర్ కింగ్.


 ఇక ఇప్పుడు 5 వ సారి ఐపీఎల్ టైటిల్ గెలవాలని కన్నేసింది. ఇకపోతే ఇటీవల జరిగిన మెగా వేలంలో ఎంతో మంది ఆటగాళ్లను ధోని వ్యూహాత్మకంగా జట్టులోకి తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందే సూరత్ వేదికగా ప్రీ క్యాంప్ నిర్వహించగా.. ఆటగాళ్లు అందరికీ కూడా ప్రాక్టీస్ చేయించేందుకు  సిద్ధమయ్యాడు ధోని. ఐపీఎల్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు ఊహించని షాక్ తగిలింది.


 ఏకంగా మెగా వేలంలో 14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన యువ ఆల్రౌండర్ దీపక్ చాహర్ ఇటీవలే గాయం బారినపడి భారత జట్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు అందుబాటులో ఉండడం కూడా కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీఎస్కే అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ దీపక్ చాహర్ కాస్త ఆలస్యం అయినప్పటికీ జట్టులో చేరబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఏప్రిల్ రెండో వారం నాటికి చాహర్ అందుబాటులోకి రాబోతున్నాడని సమాచారం. కాగా మార్చి 26వ తేదీన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: