2008 లో బిసిసీఐ ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ ప్రారంభించింది. ఇక అప్పుడు భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక దిగ్గజ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక అలాంటి సమయంలోనే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. దీంతో ఇక మొదటి సీజన్లోనే చెన్నై జట్టు కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. తనదైన శైలిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుకు నడిపించి వరసగా టైటిల్స్ అందించాడు. దీంతో ఇక చెన్నై జట్టు  ఏ జట్టు సాధ్యం కాని రీతిలో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. అయితే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు మహేంద్రసింగ్ ధోని.


 ఇక చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు తెలిపాడు. జడేజా నే ఇక చెన్నై జట్టు కెప్టెన్గా ముందుకు నడిపించపోతున్నాడు. ఇక ఏ క్షణంలో ధోనీ తన పూర్తి క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అయితే ఇదే సమయంలో మరో వార్త కూడా వైరల్ గా మారిపోయింది. చెన్నై జట్టులో ధోనీ తర్వాత ధోనీ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడు సురేశ్ రైనా. జట్టుకు టైటిల్ అందించడంలో ఎంతో కీలకపాత్ర వహించాడు. ఒంటిచేత్తో ఎన్నోసార్లు చెన్నైకి విజయాన్ని అందించాడు. ఇక ధోని అభిమానులు తల అని పిలిస్తే సురేష్ రైనాను చిన్న తల అని పిలిచేవారు.


 అంత గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి సురేష్ రైనాను ఇటీవలే చెన్నై జట్టు పక్కనపెట్టేసింది.మెగా వేలంలోకి వదిలేసింది. మళ్ళీ కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. దీంతో సురేష్ రైనా విషయంలో ఎందుకు చెన్నై ఇలా చేస్తుంది అని అందరూ అవాక్కయ్యారు. సురేష్ రైనా ను తప్పించడం వెనుక ధోనీ పెద్ద ప్లాన్ వేసాడు అన్నది ఇప్పుడు అర్థమైంది అంటున్నారు కొంతమంది అభిమానులు. ధోని  తర్వాత జట్టులో సీనియర్ క్రికెటర్ గా ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న క్రికెటర్ గా ఉన్న సురేష్ రైనాను తప్పించడానికి కారణం పాటు రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాలనే ఆలోచన అన్నది తెలుస్తుంది. సురేష్ రైనా జట్టులో ఉంటే అతని కాదని జట్టుకి జడేజా కెప్టెన్ అయితే అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే అతని తప్పించి ఇక ఇప్పుడు ప్లాన్ ప్రకారమే  రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించారు అని అనుకుంటున్నారు కొంతమంది అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: